బ్రాండ్ అంబాసిడర్ గా క్రిస్ గేల్!

4 May, 2014 15:41 IST|Sakshi
బ్రాండ్ అంబాసిడర్ గా క్రిస్ గేల్!
న్యూఢిల్లీ: స్వదేశీ మొబైల్ కంపెనీ వ్యామ్ కు వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. భారత్ లో తయారయ్యే వ్యామ్ కంపెనీ స్మార్ట్ ఫోన్లు, ఫీచర్ ఫోన్లు, ట్యాబ్లెట్స్ కు గేల్ ప్రమోషన్ కార్యక్రమాన్ని చేపడుతారు.
 
దేశవ్యాప్తంగా అమ్మకాలను పెంచడానికి, వినియోగదారులను ఆకర్షించడానికి క్రిస్ గేల్ ను ఎంపిక చేసుకున్నట్టు వ్యామ్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 
 
మైదానంలో తన ఆటను చూసి వ్యామ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకోవడం ఆనందంగా ఉంది. కొద్దికాలంలోనే వ్యామ్ కంపెనీ ఒక మిలియన్ వినియోగదారులను చేరుకుంది. వ్యామ్ కు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించడం గర్వంగా ఉంది అని క్రిస్ గేల్ తెలిపారు. 
 
మరిన్ని వార్తలు