టెక్నాలజీ ఊతంతో స్వచ్ఛమైన ఇంధనాలు

27 Jun, 2020 05:45 IST|Sakshi

రిలయన్స్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ

న్యూఢిల్లీ: పర్యావరణానికి అనుకూలమైన, సమర్ధమంతమైన, చౌకైన ఇంధనాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. కాలుష్యకారక కార్బన్‌డైఆక్సైడ్‌ను రీసైక్లింగ్‌ చేసేందుకు టెక్నాలజీలను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఎఫ్‌ఐఐ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ సదస్సులో వీడియో లింక్‌ ద్వారా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు.

ముడిచమురు ఎగుమతిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్‌ అబ్దుల్‌అజీజ్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌–సౌద్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. కార్బన్‌డైఆక్సైడ్‌ను ఒక భారంగా భావించకుండా టెక్నాలజీ ఊతంతో ఇతరత్రా ఉత్పత్తుల కోసం దాన్ని ముడి వనరుగా మార్చుకునే అంశంపై దృష్టి పెట్టాల్సి ఉందని ముకేశ్‌ అంబానీ అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచంలోని 800 కోట్ల మంది జనాభాకు ఇంధనం అనేది తప్పనిసరిగా అవసరం. ఈ నేపథ్యంలో చౌకైన, సమర్థమంతమైన, స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించాలి. అది కూడా బాధ్యతాయుతమైన పద్ధతిలో చేయగలగాలి‘ అని అంబానీ చెప్పారు.

మరిన్ని వార్తలు