ఏటా 200 కొత్త శాఖలు: ముత్తూట్‌

29 Nov, 2019 02:47 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ దేశవ్యాప్తంగా ఏటా 200 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం సంస్థకు 3,600 సెంటర్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణలో 265, ఆంధ్రప్రదేశ్‌లో 317 నెలకొన్నాయని ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ వాసుదేవన్‌ రామస్వామి తెలిపారు. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కోల వినోద్‌ కుమార్‌తో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా 60 శాఖలు రానున్నాయని చెప్పారు. ఒక్కో కేంద్రానికి 3–5 మంది సిబ్బంది అవసరమవుతారని వివరించారు. అసెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ 2018–19లో రూ.11,200 కోట్లు ఉన్నాయి. ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో 15–17 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు