ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా స్మార్ట్‌ టీవీలు..!

7 Nov, 2019 12:22 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ సంస్థ నోకియా.. భారత కన్సూమర్‌ డ్యూరబుల్స్‌ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి త్వరలోనే స్మార్ట్‌ టీవీలను ఇక్కడి మార్కెట్లో విడుదలచేయనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యం కుదిరినట్లు వెల్లడించింది. భారత వినియోగదారులకు తగిన విధంగా నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ టీవీల తయారీ, పంపిణీని ఫ్లిప్‌కార్ట్‌ సులభతరం చేయనుందని ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే.. నూతన టీవీల స్పెసిఫికేషన్స్, ధర, ప్రారంభ తేదీల వంటి వివరాలను మాత్రం నోకియా వెల్లడించలేదు. మరోవైపు మోటరోలా సెప్టెంబర్‌లోనే తన స్మార్ట్‌ టీవీలను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా విక్రయించనున్నట్లు ప్రకటించింది. వీటి ప్రారంభ ధర రూ. 13,999 వద్ద నిర్ణయించినట్లు వెల్లడించింది. ఇక శాంసంగ్, మైక్రోమాక్స్, ఇంటెక్స్, షావోమి, మోటరోలా, వన్‌ప్లస్‌ సంస్థలు ఫ్లిప్‌కార్ట్‌లో తమ స్మార్ట్‌టీవీలను ఇప్పటికే అందుబాటులో ఉంచాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు