అద్భుత ఫీచర‍్లతో నోకియా ఎక్స్‌ 71

2 Apr, 2019 20:27 IST|Sakshi

పంచ్‌ హోల్‌డిస్‌ప్లేతో వస్తున్న తొలి ఫోన్

48 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా

అద్భుత ఫీచర్లతో నోకియా సంస్థ మరోకొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.  నోకియా బ్రాండ్‌పై పలు స్మార్ట్‌ఫోన్‌లను  ఆవిష్కరిస్తున్న హెచ్‌ఎండీ గ్లోబల్‌ మంగళవారం తైవాన్‌లో జరిగిన కార్యక్రమంలో మరొక స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. హోల్‌ పంచ్‌  డిస్‌ప్లేతో తొలి స్మార్ట్‌ఫోన్‌ కాగా, రియర్‌ ట్రిపుల్‌ కెమెరా ముఖ్యంగా  48 ఎంపీ భారీ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. 

 దీని ధరను 11,900 తైవాన్‌ డాలర్లుగా నిర్ణయించింది. అంటే భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 26700. అక్కడి ఏప్రిల్‌ 30నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది. అయితే,  భారత్‌లో నోకియా  ఎక్స్‌ 71 స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడు విడుదల చేసేదీ కంపెనీ స్పష్టం చేయలేదు. 

నోకియా ఎక్స్‌71  ఫీచర్లు
 6.3 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే 
ఆండ్రాయిడ్‌ 9.0
స్నాప్‌డ్రాగన్‌ 660 ప్రాసెసర్‌
6జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 
256జీబీ వరకూ  విస్తరించుకునేఅవకాశం
48+5+8  రియర్‌ ట్రిపుల్‌  కెమెరాలు 
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా