బిగ్‌ రిలీఫ్‌ : ఊపందుకున్న వాహన విక్రయాలు

11 Nov, 2019 12:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనంతో ఆటోమొబైల్‌ రంగం కుదేలైన క్రమంలో పండుగ సేల్స్‌ ఊరట కల్పించాయి. అక్టోబర్‌ నెలలో దేశవ్యాప్తంగా ప్రయాణీకుల వాహన విక్రయాలు 0.28 శాతం పెరిగాయని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యాన్యుఫ్యాక్చరర్స్‌ సొసైటీ (ఎస్‌ఐఏఎం) గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది అక్టోబర్‌లో 2.84,223 వాహనాలు విక్రయించగా, ఈ అక్టోబర్‌లో 2,85,027 వాహనాలు అమ్ముడయ్యాయి.

ఉద్యోగుల తొలగింపు, డిమాండ్‌ లేమితో సతమతమవుతున్న ఆటోమొబైల్‌ పరిశ్రమ వాహన విక్రయాలు స్వల్పంగా పెరగడంతో కోలుకుంటోందనే సంకేతాలు పంపింది. మరోవైపు ఆటోసేల్స్‌ గత కొన్ని నెలలుగా గణనీయంగా పడిపోతున్న క్రమంలో గత నెలలో ఉత్పత్తిని ఆయా కంపెనీలు 21.14 శాతం మేర తగ్గించాయి. ఎగుమతులు 2.18 శాతం పడిపోయాయని ఎస్‌ఐఏఎం నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు