హోం లోన్లపై ఎస్‌బీఐ తీపి కబురు

19 Jun, 2017 15:21 IST|Sakshi
హోం లోన్లపై ఎస్‌బీఐ తీపి కబురు

ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీపై  హోంలోన్లను తక్కువ వడ్డీరేట్లతో ఆఫర్‌ చేస్తోంది. పరిమిత కాలానికి అందుబాటులోకి తెచ్చిన ఈ ఆఫర్‌ లో  రూ. 30లక్షల వరకు రుణాలపై  8.35 శాతం వడ్డీరేటు వర్తించనుంది.అలాగే  జూన్‌ 30 లోపు తీసుకున్న రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజును కూడా రద్దుచేసింది. దీంతోపాటు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద రూ. 2.67లక్షల దాకా సబ్సిడీని అందించనుంది.
ప్రభుత్వం సరసమైన ధరల్లో  సొంత ఇంటిని   అందించాలన్స ప్రభుత్వం పథకంలో భాగంగా  ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.  తక్కువ,  మధ్యతరహా ఆదాయ వర్గాలకు సబ్సిడీ గృహ రుణాలను అందించే లక్ష్యంగా  కేంద్రం ప్రకటించిన 'ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన' కింద  అర్హులైనవారికి రూ. .67 లక్షలు సబ్సీడీ  అందిస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. జూన్ 30, 2017 వరకు ఎలాంటి ప్రాసెసింగ్ రుసుము లేకుండా గృహ రుణాలను తీసుకోవచ్చని తెలిపింది. ఈ సదుపాయం నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ గుర్తింపు పొందిన   షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్, ప్రైవేట్ హౌసింగ్ బ్యాంకు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ హెఫ్ సిల) ద్వారా అందుబాటులోఉంటుందని పేర్కొంది.  అంతేకాదు  ఇందుకోసం  ‘ఎస్‌బీఐ లోన్స్‌’ పేరుతో ఒక ఆండ్రాయిడ్‌ యాప్‌ను కూడా ప్రారంభించింది. దీని ద్వారా రుణం లభ్యత తదితర  వివరాలతోపాటు  గృహ రుణాలకు దరఖాస్తు చేయడానికి వినియోగదారులకు సహాయం అందుతుందని బ్యాంక్‌ వెల్లడించింది.

జీతాలు తీసుకునే వారికి : మహిళలు 8.35%, ఇతరులకు 8.40%
జీతాలు లేనివారికి: మహిళలు 8.50% ఇతరులకు  8.55% ప్రకారం గృహరుణాలు లభిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు