హాలిడే మూడ్‌ : భారీ అమ్మకాలు

24 Dec, 2018 15:49 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆరంభంనుంచీ  స్వల్ప నష్టాలమధ్య ఊగిసలాడిన కీలక సూచీలు చివరకు బలహీనంగా క్లోజ్‌ అయ్యాయి. ముఖ్యంగా ఆఖరి గంటలో ఇన్వెస్లర్ల అమ్మకాలతో సెన్సెక్స్‌ ఏకంగా 272 పాయింట్లు కుప్పకూలి 35, 470 వద్ద, నిప్టీ 91 పాయింట్లు నీరసించి 10663 వద్ద ముగిసింది.

ఆటో, బ్యాంకింగ్‌ సెక్టార్‌, మెటల్‌, నష్టాలు మార్కెట్లను పతనం దిశగా తీసుకెళ్లాయి. అయితే ఐటీ మాత్రం లాభపడింది.  ముఖ్యంగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ బై బ్యాక్‌ ఆఫర్‌ ప్రతిపదన ఇన్వెస్టర్లకు ఊతమిచ్చింది. ఇన్ఫోసిస్‌, వీప్రో, ,టీసీఎస్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, కోటక్‌ మహీంద్ర , ఐటీసీ , ఎం అండ్‌ ఎం టాప​ విన్నర్స్‌గా ఉన్నాయి. మరోవైపు  హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌, రిలయన్స్‌,  జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హీరో మోటోకార్ప్‌, ఐవోసీ, బజాజ్‌ ఆటో, ఎన్‌టీపీసీ,   ఎల్‌ అండ్‌ టీ, నష్టపోయాయి.

అటు డాలరు మారకంలో రూపాయి బలంగా కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు