భారీ నష్టాలు : 10700 కిందికి నిఫ్టీ

20 Nov, 2018 15:05 IST|Sakshi


సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో ప్లాట్‌గా ఉన్నా అనంతరం అమ్మకాల జోరుతో ఏకంగా 300పాయింట్లకు పైగా పతనమైంది.  సెన్సెక్స్‌ 331 పాయింట్లు కోల్పోయి 35, 437 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు  పతనమై 10, 653 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే.  మెటల్‌ బాగా నష్టపోతుండగా  టెక్‌, పార్మా ,పీఎస్‌యూ బ్యాంక్స్‌ రంగ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. హిందాల్కో, యస్‌బ్యాంక్‌ 5 శాతం చొప్పున పతనం కాగా, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, యూపీఎల్‌, ఐబీ హౌసింగ్‌, విప్రో, వేదాంతా టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. అయితే ఇండస్‌ఇండ్‌, అదానీ పోర్ట్స్‌, గెయిల్‌, ఎంఅండ్ఎం, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, టాటా మోటార్స్‌, ఐషర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌  లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

అటు డాలరు మారకంలో రుపీ మంగళవారం బాగా పుంజుకుంది. వరుస సెషన్లుగా  స్థిరపడుతూ వస్తున్న రుపీ ప్రస్తుతం 71.48 వద్ద ఉంది.

మరిన్ని వార్తలు