ఒడిదుడుకుల మధ్య స్టాక్‌మార్కెట్లు 

28 Jun, 2019 14:24 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీ స్టాక్‌మార్కెట్లు  ఒడిదుడుకుల మధ్య కదులుతున్నాయి. ట్రేడర్లు అమ్మకాలు చేపట్టడంతో నష్టాల బాటపట్టిన  సెన్సెక్స్‌ 105 పాయింట్లు క్షీణించి 39,479 వద్ద  నిఫ్టీ సైతం 33 పాయింట్లు నష్టంతో 11,809 వద్ద ట్రేడవుతోంది. జీ20 సమావేశాలలో భాగంగా నేడు అమెరికా, చైనా అగ్రనేతల మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో  గ్లోబల్‌ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు కూడా బలహీనంగా ఉన్నాయి.  తద్వారా ఎఫ్‌ అండ్‌ వో సిరీస్‌ నెగిటివ్‌  ఆరంభాన్నిచ్చింది. 

పీఎస్‌యూ బ్యాంక్స్‌ , ఐటీ, ఫార్మా  లాభపడుతుండగా  మెటల్‌  ప్రయివేట్‌ బ్యాంక్స్‌ నష్టపోతున్నాయి.  ఇన్‌ఫ్రాటెల్‌, యూపీఎల్‌, యస్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, ఐబీ హౌసింగ్‌, వేదాంతా, ఇండస్‌ఇండ్, టాటా స్టీల్‌, ఓన్‌జీసీ, ఎయిర్‌టెల్‌  టాప్‌ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.  వివిధ పీఎస్‌యూ బ్యాంకులతోపాటు  టెక్ మహీంద్రా, గెయిల్‌, ఎల్‌అండ్‌టీ, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, ఎస్‌బీఐ, బీపీసీఎల్‌, బ్రిటానియా, ఎన్‌టీపీసీ  లాభపడుతున్నాయి.

>
మరిన్ని వార్తలు