స్వల్ప లాభాల్లో సెన్సెక్స్!

21 Aug, 2014 12:44 IST|Sakshi
స్వల్ప లాభాల్లో సెన్సెక్స్!
హైదరాబాద్: మెటల్, హెల్త్ కేర్ రంగాల కంపెనీ షేర్లు నష్టాలకు లోనవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 37 పాయింట్ల లాభంతో 26351 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల వృద్దితో ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26464 పాయింట్ల, నిఫ్టీ 7919 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. 
 
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో పీఎన్ బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కొటాక్ మహీంద్ర, బజాజ్ ఆటో, ఎస్ బీఐ కంపెనీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. యునైటెడ్ స్పిరిట్, ఎన్ టీపీసీ, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, సెసా స్టెరిలైట్ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. 
మరిన్ని వార్తలు