జియో సిమ్ కావాలంటే ఇలా చేయండి

7 Sep, 2016 10:52 IST|Sakshi
జియో సిమ్ కావాలంటే ఇలా చేయండి

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) అనుబంధ సంస్థ రిలయన్స్ జియో 4జీ సేవలు సోమవారం నుంచి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వాయిస్ కాలింగ్‌ను పూర్తిగా ఉచితంగా అందించడంతోపాటు అత్యంత చౌక రేట్లకు డేటా ప్లాన్‌లను ప్రకటించడంతో జియో సిమ్ కార్డుల కోసం వినియోగదారులు పోటీ పడుతున్నారు. ప్రివ్యూ సేవల్లో భాగంగా డిసెంబర్ 31 వరకూ జియో వాయిస్, డేటా, యాప్స్ ఇతరత్రా సేవలన్నీ పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. దీంతో రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌ ముందు జనం బారులు తీరి కన్పిస్తున్నారు. జియో సిమ్ కార్డు కావాలంటే ఈ డాక్యుమెంట్లు కావాలి.

  • జియో సిమ్‌లు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌, మల్టీ బ్రాండ్ అవుట్‌లెట్లు, మొబైల్ ఫోన్ షాప్‌లలో లభిస్తాయి.
  • అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ తీసుకెళ్లాలి
  • ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ పట్టుకెళ్లాలి
  • ఒకవేళ ఆధార్ కార్డు తీసుకున్న రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో దరఖాస్తు చేస్తే యాక్టివేషన్ కు ఎక్కువ సమయం పడుతుంది
  • రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు తప్పనిసరి
  • మై జియో యాప్ నుంచి ఆఫర్ కోడ్ ను తీసుకెళ్లడం మర్చిపోవద్దు
  • జియో పోస్ట్ పెయిడ్ సిమ్ కావాలంటే ప్రస్తుతం వాడుతున్న మొబైల్ బిల్లు సమర్పించాలి
  • అయితే పోస్ట్ పెయిడ్ బిల్లు మూడు నెలలలోపుది అయ్యుండాలి. బిల్లుపై వినియోగదారుడి అడ్రస్ స్పష్టంగా కనబడేట్టు ఉండాలి

మరిన్ని వార్తలు