సబ్సిడీ నగదు బదిలీకి ఆధార్‌ ఈ–కేవైసీ వాడొచ్చు

29 Oct, 2018 02:05 IST|Sakshi

బ్యాంకులకు యూఐడీఏఐ స్పష్టత

న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలకు సంబంధించి నగదు బదిలీ (డీబీటీ) లబ్ధిదారుల ధృవీకరణ కోసం బ్యాంకులు ఆధార్‌ ఈ–కేవైసీని ఉపయోగించవచ్చని విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికరణ సంస్థ యూఐడీఏఐ స్పష్టతనిచ్చింది. ఒకవేళ ఖాతాదారు స్వచ్ఛందంగా అనుమతి ఇచ్చిన పక్షంలో వారి ధృవీకరణకు ఆఫ్‌లైన్‌లో పేపరు రూపంలోని ఆధార్‌ కార్డును పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది.

ధృవీకరణ కోసం ఆధార్‌ను ఏయే సందర్భాల్లో, ఏయే రూపాల్లో ఉపయోగించవచ్చో బ్యాంకులకు గత వారంలో చేసిన సూచనల కాపీని తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌కు కూడా పంపినట్లు యూఐడీఏఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. గుర్తింపు, చిరునామా ధృవీకరణ కోసం ప్రైవేట్‌ సంస్థలు ఆధార్‌ను ఉపయోగించడంపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో యూఐడీఏఐ తాజా వివరణనిచ్చింది.

>
మరిన్ని వార్తలు