టాటా మోటార్స్‌లో నేడు భారీ బ్లాక్‌ డీల్‌!

13 Dec, 2016 01:25 IST|Sakshi
టాటా మోటార్స్‌లో నేడు భారీ బ్లాక్‌ డీల్‌!

రూ.500 ధరకు 5 కోట్ల షేర్లు కొనుగోళ్లు
డీల్‌ విలువ రూ.2,500 కోట్లు


న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌లో భారీ బ్లాక్‌డీల్‌ నేడు(మంగళవారం) జరగనున్నది. ఒక ‘రహస్య’ క్లయింట్‌ కోసం ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ 5 కోట్ల (1.73 శాతం వాటా) షేర్లను రూ.499.8 ధరకు (సోమవారం ముగింపు ధర రూ.455కు ఇది 10 శాతం ప్రీమియమ్‌) కొనుగోలు చేయనున్నదని సమాచారం. ఈ డీల్‌ విలువ రూ.2,500 కోట్లు. సైరస్‌ మిస్త్రీని డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించేందుకు ఈ నెల 22న టాటా మోటార్స్‌ అసాధారణ సర్వ సభ్య సమావేశం(ఈజీఎమ్‌) జరగనున్న విషయం తెలిసిందే.

ఈ ఈజీఎమ్‌లో ఓటింగ్‌లో పై చేయి సాధించడానికే టాటా సన్స్‌ ఈ షేర్లను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అయితే టాటా సన్స్‌ ప్రతినిధి  ఈ విషయాన్ని ద్రువీకరించలేదు. ఈ డీల్‌ నేపథ్యంలో అమెరికా మార్కెట్లో టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ దాదాపు 4 శాతం ఎగసింది. రివర్స్‌ బుక్‌ బుల్డింగ్‌ విధానంలో ఈ షేర్ల కొనుగోలు జరుగుతుందని అంచనా.

>
మరిన్ని వార్తలు