మార్నింగ్‌ రైడ్‌కు వెళ్తే ఐఫోన్‌, సైకిల్‌ చోరీ..

20 Oct, 2019 10:16 IST|Sakshi

న్యూఢిల్లీ : ఉదయాన్నే వ్యాయామం కోసం సైకిల్‌పై వచ్చిన యువకుడి నుంచి ఖరీదైన సైకిల్‌తో పాటు ఐఫోన్‌ను దుండగులు గుంజుకున్న ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. ద్వారకా సెక్టార్‌ 19కు చెందిన నిషాంత్‌ సింగ్‌ శుక్రవారం తెల్లవారుజామున సైకిల్‌పై వస్తుండగా కన్నాట్‌ప్లేస్‌ వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతడి వద్ద నుంచి సైకిల్‌, ఐఫోన్‌ను తీసుకుని పరారయ్యారని పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరు బైక్‌పై, మరొకరు తన సైకిల్‌పై పారిపోయారని నిందితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన సైకిల్‌ బాస్కెట్‌లో ఐఫోన్‌-ఎక్స్‌ఎస్‌ మ్యాక్స్‌ ఉందని బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎంను హత్య చేయాలంటూ వీడియో.. వ్యక్తి అరెస్ట్‌!

కరోనా: ప్రముఖ బ్యాట్స్‌మన్‌ టీషర్ట్‌ వేలం!

విద్యార్థినిని ప్రేమ పేరుతో..

కరోనా: హిట్‌ మ్యాన్‌ భారీ విరాళం!

పోలీసులు విచారణకు వెళ్తే..

సినిమా

మరో సింగర్‌కు కరోనా పాజిటివ్‌!

జోర్డాన్ ఎడారిలో చిక్కుకున్న‌ టాప్‌ హీరో

కరోనాపై కీరవాణి కదిలించే పాట..

ఆసక్తికర విషయం చెప్పిన నమ్రత

‘ఉప్పెన’ నుంచి న్యూలుక్‌ విడుదల

నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించిన సోనాక్షి