షాద్‌నగర్‌ కేసులో రామసుబ్బారెడ్డికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్‌

25 Jul, 2019 16:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : షాద్‌నగర్‌ జంట హత్యల కేసులో మాజీమంత్రి రామ సుబ్బారెడ్డిని సుప్రీంకోర్టు నిర్దోషిగా తేల్చింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం రామ సుబ్బారెడ్డికి  క్లీన్ చిట్ ఇచ్చింది. 1990లో మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బంధువులు శంకర్‌రెడ్డి, గోపాల్‌ రెడ్డిలను ప్రత్యర్థులు హత్య చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో ఏడాదిన్నరపాటు జైల్లో ఉన్నరామసుబ్బారెడ్డిని  2006లో హైకోర్టు కేసును కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ  ఆదినారాయణరెడ్డి కుటుంబం 2008లో సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోగా దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వైఎస్సార్సీపీ నుంచి గెలిచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆదినారాయణరెడ్డి అలాగే రామసుబ్బారెడ్డి ప్రస్తుతం ఒకే పార్టీ(టీడీపీ)లో ఉన్నారు. దీంతో ఆ పార్టీ అధినేత ఇరు వర్గాల మధ్య రాజీ కుదుర్చడంతో ఆదినారాయణ కుటుంబం సుప్రీంకోర్టులో తాము రాజీ పడుతున్నట్లు తెలిపింది. కాగా నేడు సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టి వేసింది. 

మరిన్ని వార్తలు