జియో లాటరీ పేరుతో లూటీ!

15 Oct, 2019 11:29 IST|Sakshi

వివాహిత నుంచి రూ.41 వేలు స్వాహా

సాక్షి, సిటీబ్యూరో: జియో లాటరీ పేరుతో ఎర వేసిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన ఓ వివాహిత నుంచి రూ.41,300 కాజేశారు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాంపల్లిలోని ఆగపుర ప్రాంతానికి చెందిన వివాహిత భార్గవికి ఈ నెల 9న +923008140684 నంబర్‌ నుంచి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. అవతలి వ్యక్తులు తాము జియో టెలికాం కంపెనీ నుంచి మాట్లాడుతున్నామంటూ చెప్పారు. తమ సంస్థ నిర్వహించిన ఉత్తమ కస్టమర్ల లక్కీడ్రాలో ప్రథమ బహుమతి వచ్చిందని, దీనికింద రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆ డబ్బు తీసుకునేందుకు వివరాలు తెలపాలని కోరడంతో భార్గవి చెప్పారు.

ఆ మరుసటి రోజు జియో విన్నర్స్‌ సర్టిఫికెట్‌ పేరుతో ఓ ధ్రువీకరణ పత్రాన్ని పంపారు. దానిపై ఉన్న లోగో, ఇతర వివరాలు చూసిన భార్గవి వారిని పూర్తిగా నమ్మింది. ఆ తర్వాత అసలు వ్యవహారం ప్రారంభించిన నేరగాళ్లు లాటరీ సొమ్ము తీసుకోవడానికి జీఎస్టీ తదితరాలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. అలా మూడు దఫాల్లో రూ.41,300 వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేయించుకున్నారు. అయినా ఆగకుండా వివిధ కారణాలు చెబుతూ మరికొంత మొత్తం డిపాజిట్‌ చేయమని కోరారు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. సాంకేతిక ఆధారాలతో పాటు బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రైలు కిందపడి యువతి మృతి

అక్కడ చోరీ ...ఇక్కడ విక్రయం!

భవనం పైనుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

బ్యాంక్‌లోని 17 కిలోల బంగారం మాయం!

ఖాకీల ముందే బావను కడతేర్చాడు..

ఐఏఎఫ్‌ అధికారులకు కోర్ట్‌ మార్షల్‌

అల్లుడిపై కత్తితో దాడి చేసిన మామ

ప్రియుడిపై ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఫిర్యాదు

పిల్లల ఆకలి చూడలేక తల్లి ఆత్మహత్య

ఉరి వేసుకుని దంపతులు ఆత్మహత్య

బాలుడిని బలి తీసుకున్న మ్యాగీ వంట..

తరచూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతోందని..

ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ..

ఆర్టీసీ బస్‌-టాటా ఏస్‌ ఢీ, ముగ్గురు మృతి

చాదర్‌ఘాట్‌: ఆ దొంగలు దొరికిపోయారు!

భర్తపై కోపం.. పోలీసులపై చూపించింది..!!

మైనర్‌తో శృంగారం కోసం 565 కి.మీ నడిచాడు

ఏటీఎంలకు వెళ్తున్నారా? బీ కేర్‌ఫుల్‌..

పర్యాటకంలో విషాదం...

జేసీ దివాకర్‌రెడ్డికి టోకరా

మహిళా రోగిపై మూడేళ్లుగా డాక్టర్‌ పైశాచికం..

ప్రేమ వివాహం.. అల్లుడిపై దాడి చేసిన మామ

రైల్వే వెబ్‌సైట్‌లో నకిలీ ఐడీలు!

కూతురిని చూసుకునేందుకు వస్తూ..

తిరగదోడుతున్నారు..!

వేర్వేరు ఘటనల్లో ఆరుగురి అదృశ్యం

మోదీ అన్న కూతురి పర్స్‌ దొంగల అరెస్ట్‌

ఇందిరానగర్‌లో ముట్టడి.. కట్టడి

ఎలక్షన్‌ ఫండ్‌ కోసం ‘ఓఎల్‌ఎక్స్‌’ మోసం

యువతి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బీ రికార్డును బ్రేక్‌ చేసిన షారుఖ్‌

తమన్నా మారిపోయిందా..?

రుషికేశ్‌లో రజనీకాంత్‌

అమెరికాలో పండగ

అద్దంలో చూసుకొని భయపడ్డాను

ఐదుపైసల సోడా గుర్తొచ్చింది