భార్య నోట్లో గుడ్డ పెట్టి.. తలను గోడకు బాది

1 Sep, 2018 11:46 IST|Sakshi
సావిత్రి మృత దేహం

బాన్సువాడ టౌన్‌ : పట్టణానికి చెందిన ఈరబోయిన సావిత్రి అలియాస్‌ అనురాధ(34) అనే వివాహితను ఆమె భర్త ఈరబోయిన రాజు హత్య చేసినట్లు బాన్సువాడ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు. పట్టణంలోని గూడేంగల్లికి చెందిన రాజుకు పదేళ్ల కిత్రం బీర్కూర్‌ మండలం దామరంచ గ్రామానికి చెందిన సావిత్రితో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. తాగుడుకు బానిసైన రాజు నిత్యం భార్య సావిత్రిని వేధిస్తూ కొట్టేవాడు.

గురువారం బాన్సువాడలో సంత కావడంతో భార్యభర్తలు ఇద్దరు కలిసి సంతకు వెళ్లి కురగాయలు కొనుక్కొని కల్లు తాగి ఇంటికి వచ్చారు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సావిత్రి నోట్లో గుడ్డ పెట్టి తలను గోడకు బాదాడు. తీవ్రంగా గాయాలైన సావిత్రి మెడను నొక్కడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం ఎప్పటి లాగానే లేచి తన భార్య రాత్రి పడుకుని లేవడం లేదని చుట్టుపక్కల వారిని నమ్మించాడు.

మామూలుగానే చనిపోయిందని బావించిన కుటుంబికులు సావిత్రి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి బంధువులు వచ్చి చూడగా మెడపై, తలపై. వీపుపై గాయాలు కనబడడంతో పోలీసులకు సమాచారం అందించారు. సీఐ వచ్చి సావిత్రి భర్త రాజును అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపినట్లు ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు. శవాన్ని పోస్టుమాస్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సావిత్రి మేనమామ లస్మయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వక్రించిన విధి

గుండెపోటుతో అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ మృతి

రైలు ఢీకొని చిరుత మృతి

విదేశాలకు రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

తల్లిపై నిందలకు మనస్తాపం.. కుటుంబం ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడుదలైన ‘ఉద్యమ సింహం’ ఆడియో

చేదు అనుభవాలెన్నో చవిచూశాను

ఆమె బయోపిక్‌ను నిషేధించండి

2.ఓ కోసం 3డీ థియేటర్లు!

‘ఇప్పుడు సంతోషంగా చనిపోతాను’

సదా సౌభాగ్యవతీ భవ