హత్య కేసులో ప్రియుడిని పట్టించిన ప్రియురాలు

5 Oct, 2019 11:36 IST|Sakshi

చెన్నై,తిరువొత్తియూరు: కుమారపాళయం కావేరి నదిలో తోసి నేత కార్మికుడిని హత్య చేసిన వ్యవహారంలో ప్రియురాలు, తన ప్రియుడిని పోలీసులకు పట్టించింది. వివరాలు.. నామక్కల్‌ జిల్లా కుమారపాళయంకు చెందిన నేత కార్మికుడు వెంకటేశన్‌ (38). అతను గత నెల 8వ తేది నుంచి అదృశ్యమయ్యాడు. తండ్రి కుమారపాళయం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంకటేశన్‌తో కాపురం చేస్తున్న సెల్వి, ఆమె ప్రియుడు పెరుమాల్‌ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో వెంకటేశన్‌ను కావేరి నదిలో తోసి హత్య చేసినట్టు, తన కుమార్తెను ప్రియుడు పెరుమాల్‌ నుంచి కాపాడుకోవడానికి ఈ నిజం బయటపెట్టినట్టు సెల్వి పోలీసులకు తెలిపింది.

సెల్వి భర్త నుంచి విడిపోయి జీవిస్తోంది. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో నేత కార్మికుడు వెంకటేశన్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ 10 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మద్యం అలవాటు ఉన్న వెంకటేశన్‌ రోజూ తాగి వచ్చి సెల్విని చిత్రహింసలు పెట్టేవాడని తెలిసింది. దీంతో విరక్తి చెందిన సెల్వి వెంకటేశన్‌ మిత్రుడు కుమార్‌ అలియాస్‌ పెరుమాల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సంగతి తెలుసుకున్న వెంకటేశన్‌ ఇద్దరిని నిలదీశాడు. దీంతో వెంకటేశన్‌ హత్యచేయడానికి సెల్వి, పెరుమాల్‌ పథకం వేశారు. ఈ క్రమంలో అతనికి మద్యం తాగించి పెరుమాల్‌ కావేరి నదిలోకి తోశాడు. మొదట అతను నీటి నుంచి ఈదుకుంటూ బయటకు వచ్చాడని.. తిరిగి అతన్ని లోతైన ప్రాంతంలో తోసి వేయడంతో వెంకటేశన్‌ మృతి చెందినట్టు తెలిసింది. దీని తరువాత పెరుమాల్‌ సెల్వి కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో సెల్వి అతన్ని పోలీసులకు పట్టించింది. దీంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి పెరుమాల్‌ కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మద్యం విక్రయిస్తున్న ఉపాధ్యాయుడు అరెస్టు

వీరికి మోహం... వారికి దాహం

రుధిర దారులు

అమ్మమ్మపై మనవడి పైశాచికత్వం

మాట వినలేదని స్నేహితుడ్ని కడతేర్చాడు

బాలికపై అత్యాచార యత్నం

అత్యాశే కొంపముంచింది

వలకు చిక్కని తిమింగలాలెన్నో!

పీవీపీని బెదిరించిన బండ్ల గణేష్‌

అనంతపురంలో ఘోర ప్రమాదం

మణిరత్నంపై రాజద్రోహం కేసు

ఆశించిన డబ్బు రాలేదని..

టీవీ చానల్‌ మార్చే విషయంలో గొడవ 

సైంటిస్ట్‌ హత్యకు కారణం అదే: సీపీ

భార్య ప్రియుడ్ని కోర్టు కీడ్చి..

లెక‍్చరర్స్‌ ఫోరం అధ్యక్షుడి ఇంట్లో ఏసీబీ సోదాలు

మణిరత్నం సహా 50మందిపై కేసు నమోదు

వీడని మిస్టరీ

ఆరిపోయిన ఇంటి దీపాలు

కళ్లెదుటే గల్లంతు

వీడిన కిడ్నాప్‌ మిస్టరీ..

పెళ్ళైన నెలకే భార్య వదిలేసి వెళ్ళిపోయింది

వైఎస్సార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అదృశ్యం.. ఆపై అస్తిపంజరంగా..

‘ఏవండి.. మేమొచ్చాం లేవండి..’

చదువుకుంటానంటే..పెళ్లి చేస్తున్నారని..

ఏడాది కాలంలో నలుగురిని మింగిన 'ఆ' జలపాతం!

అనుమానిస్తున్నాడని చంపేసింది?

అవినీతి ‘శివ’తాండవం

చదువుకుంటానని మేడపైకి వెళ్లి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యువతి పట్ల హీరో అసభ్య ప్రవర్తన..

అతడినే పెళ్లి చేసుకుంటాను: హీరోయిన్‌

ఫోన్‌కి అతుక్కుపోతున్నారు

కేరళ చరిత్రతో...

గ్యాంగ్‌స్టర్‌ సినిమాలంటే ఇష్టం

డాటరాఫ్‌ శకుంతల