ఎస్పీ కార్యాలయం ముందు యువతి ఆత్మహత్యాయత్నం

24 Jan, 2018 07:11 IST|Sakshi
బాధిత యువతి హారిక

తిరుపతి క్రైం: తనను ప్రేమించి మోసం చేసిన యువకుడిపై, అతడికి సహకరిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థ యజమానిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ యువతి ఆత్మహత్యకు యత్నిం చింది. మంగళవారం అర్బన్‌ ఎస్పీ కార్యాలయం ముందు ఈ ఘటన జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు పద్మావతి పురంలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో వి. హారిక పనిచేస్తోంది. అక్కడే పనిచేస్తున్న విజయ్‌కుమార్‌ అనే యువకుడిని ప్రేమించింది. ఈక్రమంలో యువతి తనను వివాహం చేసుకోవాలని యువకుడిని కోరడంతో అతను పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాధిత యువతి తిరుచానూరు పోలీసులు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడు విజయ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు.

తనకు అక్కడ న్యాయం జరగలేదని ఎస్పీని కలసి తన పెళ్లికి అడ్డుపడుతున్న రియల్‌ ఎస్టేట్‌ యజమానిపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎస్పీ ఈస్ట్‌ సబ్‌ డివిజినల్‌ డీఎస్పీ మునిరామయ్యను విచారణ చేపట్టాలని ఎస్పీ సూచిం చారు. డీఎస్పీ విచారించిన అనంతరం చట్టప్రకారం యువకుడితో మాట్లా డి వివాహం చేసేందుకు యత్నిస్తామన్నారు. ఇదిలా ఉంటే రియల్‌ ఎస్టేట్‌ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తనకు రాష్ట్ర హోంశాఖ మంత్రి న్యాయం చేయాలని కోరుతూ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువతిని స్థానికులు ప్రభుత్వ రుయాస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రస్తుతం ఆమెకు వైద్యచికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉంది. దీనిపై పోలీసులు స్పందిస్తూ యువతికి చట్టపరంగా న్యా యం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే యువకుడిపై కేసు నమో దు చేసి రిమాండ్‌ చేయడం జరిగిందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు