జీఎస్‌టీతో నిత్యావసరాలపై మోయలేని భారం

12 Jul, 2017 12:30 IST|Sakshi
జీఎస్‌టీతో నిత్యావసరాలపై మోయలేని భారం

► ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యదర్శి ఎ.అజయ్‌శర్మ

అనకాపల్లిటౌన్‌ : పట్టణంలో సీఐటీయూ కార్యాలయంలో జీఎస్టీపై మంగళవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యదర్శి ఎ.అజయ్‌శర్మ మాట్లాడుతూ జీఎస్టీ వల్ల మధ్య తరగతి ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకుల ధరలు పెరిగి మోయలేని భారం పడనుందన్నారు. బడా వ్యాపారులకు జీఎస్టీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

2011లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకున్న ఈ జీఎస్టీ విధానం ఇపుడు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని వస్తువులు, చలనచిత్రాలపై భారీ పన్ను వసూలు చేస్తుండడం వల్ల అటువంటి రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. రాష్ట్రాలకు పన్నుపై ఉన్న అధికారాలను కేంద్రం చేజిక్కించుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు మద్యం, పెట్రోల్‌ అత్యధిక ఆదాయం వస్తుండడం వల్ల జీఎస్టీ మినహాయింపు ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు