సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

20 Jul, 2016 23:39 IST|Sakshi
సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
నవీపేట: వాతావరణంలో కలిగే మార్పులతో సీజనల్‌ వ్యాధులు వ్యాపిస్తాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి లక్ష్మయ్య సూచించారు. మండలంలోని మోకన్‌పల్లి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), అభంగపట్నంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయన బుధవారం సీజనల్‌ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత వాతావరణంలో డెంగీ, మలేరియా, చికున్‌ గున్యా తదితర రోగాలు వ్యాపిస్తాయన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా మారుమూల గ్రామాల్లో విద్యార్థులు ఇరుగుపొరుగు వారికి అవగాహన కల్పించాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో దోమలు తిష్టవేసి ఉంటాయని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ముందు జాగ్రత్తగా దోమల నివారణ మందును పిచికారి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీజనల్‌ వ్యాధులు–నివారణ చర్యలు అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేకాధికారి రమారాణి, ఆస్పత్రి సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్‌రావ్, సూపర్‌వైజర్‌ పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 

 

మరిన్ని వార్తలు