దాడి చేసిన ఎంపీటీసీపై చర్యలు తీసుకోవాలి

13 Dec, 2016 02:34 IST|Sakshi
కొవ్వూరు : దళితులపై దాడులకు పాల్పడిన టీడీపీ ఎంపీటీసీ అబోతుల దానయ్యపై చర్యలు తీసుకోవాలని మాలమహానాడు రాష్ట్ర సమన్వయకర్త నల్లి రాజేష్‌ డిమాండ్‌ చేశారు. ఆయనతో పాటు దళిత సంఘ నాయకులు కొవ్వూరు డీఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పెంటపాడు మండలంలో సబ్బితి కళాకాంతులకు రావిపాడు గ్రామంలో ఉన్న జిరాయితీ భూమిలో పంట చేతికి అందే సమయంలో టీడీపీ ఎంపీటీసీ దానయ్య వరి పంటను నాశనం చేయించారని ఆరోపించారు. ప్రశ్నించినందుకు కులం పేరుతో దూషించి చేతనైన పనిచేసుకోమని హెచ్చరించారన్నారు. నిందితుడిపై తక్షణం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. మాల మహానాడు జిల్లా కార్యదర్శి బొంతా కిషోర్, ఆచంట, తాడేపల్లిగూడెం నియోజకవర్గం కన్వీనర్‌లు కె.పుష్పారాజ్, గారపాటి నానాజీ, నాయుకులు పులిదిండి సుబ్బారావు, బుద్ధా అంతర్వేది, మల్లుల శ్రీనివాస్, కేదాసి ధర్మారావు, వర్ల రాజశేఖర్‌ పాల్గొన్నారు.   
 
మరిన్ని వార్తలు