భేతాళపాడులో ఘనంగా బోనాల పండగ

17 Jul, 2016 22:19 IST|Sakshi
పాపకొల్లులో బోనాలతో వస్తున్న మహిళలు

జూలూరుపాడు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బొనాల పండుగను ఆదివారం పాపకొల్లు, భేతాళపాడు గ్రామాల ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పాపకొల్లులో శ్రీకోటమైసమ్మ తల్లికి మహిళలు, యువతులు, పిల్లలు బొనమెత్తగా, భేతాళపాడులో శ్రీముత్యాలమ్మ తల్లికి బోనాన్ని సమర్పించారు. ఆషాఢ మాసం ప్రారంభం నుంచి శ్రావణ మాసం వరకు గ్రామదేవతలైన శ్రీకోటమైసమ్మ, శ్రీముత్యాలమ్మ, శ్రీపెద్దమ్మ తల్లులకు తెలంగాణ ప్రాంత ప్రజలు బొనాన్ని(భోజనం) నైవేధ్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. పాపకొల్లు గ్రామంలో శ్రీకోటమైసమ్మ తల్లికి బోనాన్ని సమర్పించేందుకు మేళతాళాలతో ఊరంతా కదిలి వచ్చారు. ముందుగా గ్రామ కూడలిలో ఉన్న  నాభిశిల వద్ద పూజలు నిర్వహించారు. ఆ తరువాత అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించారు.

మరిన్ని వార్తలు