క్యాష్ కష్టాలు.. ఏ‘మనీ’ చెప్పాలి

12 Dec, 2016 15:04 IST|Sakshi
క్యాష్ కష్టాలు.. ఏ‘మనీ’ చెప్పాలి

80 శాతం ఏటీఎంల వద్ద  నో క్యాష్ బోర్డులు
బ్యాంకుల్లోనూ అదే పరిస్థితి
నగరంలో కొంత పర్వాలేకున్నా.. గ్రామీణంలో దారుణం
జీతభత్యాలు అందక..ఉద్యోగులు
పింఛనుకు నోచుకోక వృద్ధులు, వికలాంగుల పాట్లు
నగదు ఉన్న బ్యాంకుల్లోనూ సర్దు‘పాట్లు’
సాక్షి విజిట్‌లో వెల్లడైన  వాస్తవాలు

నగదు నిల్వలు రూ.100 కోట్లు ఉన్నారుు.. బుధవారం మరో రూ.162 కోట్లు వచ్చారుు..కానీ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన జీతభత్యాలు, పెన్షన్ల మొత్తంరూ.900 కోట్లు.. వీరు కాక నగదు కోసం బ్యాంకులకు వచ్చే సామాన్య ప్రజలు, వ్యాపారులుఉండనే ఉంటారు.. ఈ అంకెలు చూస్తే చాలు.. ఎందరు జీతాలు అందుకున్నారో.. మరెందరు వృద్ధులు, వికలాంగులు పెన్షన్ల కోసం అగచాట్లు పడ్డారో అర్థమైపోతుంది..ఎవరికీ ఏ ఇబ్బంది లేదని నగదు సర్దుబాటు చేశామన్న అధికారుల ప్రకటనలను.. ‘నో క్యాష్’ బోర్డులతో దర్శనమిస్తున్న 80 శాతానికిపైగా ఏటీఎంలు, బ్యాంకు శాఖలు వెక్కిరిస్తున్నారుు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద పరిస్థితిని తెలుసుకునేందుకు ‘సాక్షి’ నిర్వహించిన విజిట్‌లో ఇవన్నీ కళ్లకు కట్టారుు. 


విశాఖపట్నం : ‘బ్యాంకుల్లో చాలినంత నగదు ఉంది.. 98 శాతం ఏటీఎంలు  పనిచేస్తున్నారుు. ఉద్యోగుల జీతభత్యాలకే కాదు..రిటైర్డు ఉద్యోగులకు పింఛన్ చెల్లింపులకూ ఎలాంటి ఇబ్బందిలేదు. సామాజిక పింఛన్‌దారులకు వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం.రూపే కార్డుతో ఇలా గీకి..అలా సొమ్ము తీసుకోవచ్చు’.. అని జిల్లా అధికారులు ఆర్భాటం చేశారు. కానీ వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నారుు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా సాక్షి బృందం ఒకేసారి మండల కేంద్రాలతోపాటు నగరంలోని బ్యాంకులు, ఏటీఎంల పనితీరుపై క్షేత్ర స్థారుు పరిశీలన చేసింది.  బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఉద్యోగులు, పింఛన్‌దారులు, వృద్ధులు, వికలాంగులు పడుతున్న పాట్లు.. నగదు కోసం వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు.

20 శాతం మందికి దక్కితే గొప్పే
జిల్లాలో 45 బ్యాంకుల పరిధిలో 738 శాఖలు ఉన్నారుు. వీటి వద్ద రూ.100 కోట్ల నగదు నిల్వలున్నాయని, బుధవారం రూ.162 కోట్లు వచ్చాయని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఉద్యోగస్తులు, రిటైర్డు ఉద్యోగులకు వారానికి గరిష్ట పరిమితికనుగుణంగా రూ.24 వేలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని గొప్పగా చెప్పింది. కానీ తొలిరోజే కనీసం 20 శాతం మంది కూడా పట్టుమని రూ. 10 వేలైనా అందుకోలేకపోయారు. పోనీ శుక్రవారమైనా అందుతాయన్న ఆశతో బ్యాంకుల బాటపట్టిన వీరికి రెండోరోజు కూడా నిరాశే మిగిలింది. సాక్షి పరిశీలనలో ఏటీఎంలే కాదు.. చాలా బ్యాంకుల వద్ద సైతం నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చారుు.

సగానికి పైగా బ్యాంకు శాఖల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చారుు.  మిగిలిన వాటిలో మూడొంతులు శాఖల్లో రూ.5వేల చొప్పునే సర్దుబాటు చేశారు. కొన్ని శాఖల్లో అరుుతే రూ.4 వేలే ఇవ్వడం కన్పించింది. జీవీఎంసీ పరిధిలోని 50 శాఖల్లోనే రూ.10వేల చొప్పున ఉద్యోగులకు ఇవ్వగలిగారు. దీంతో రెండో రోజు బ్యాంకుల ద్వారా జీతాలు, పింఛన్లు అందుకున్న వారు పది శాతానికి మించి ఉండరని బ్యాంకు అధికారులే అంటున్నారు.ఇక ఏటీఎంల ద్వారా కనీసం రూ.2,500 చొప్పునైనా తీసుకుందామని ఉద్యోగులు, పింఛన్‌దారులు పరుగులు తీస్తే 80శాతం ఏటీఎంల వద్దనో క్యాష్ బోర్డులే దర్శనమిచ్చారుు. పని చేస్న్ను  పది శాతం ఏటీఎంలలో రూ.2వేల నోట్లు తప్ప చిల్లర నోట్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఇవీ ఉద్యోగుల లెక్కలు
జిల్లాలో 25వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులున్నారు. 13 వేల మంది ఉపాధ్యాయులు, జూనియర్ కళాశాలల నుంచి వైద్యకళాశాలల వరకు ఉన్నత విద్యాసంస్థల్లో మరో 10వేల మందికి పైగా ఉన్నారు. అలాగే సుమారు 39 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 75వేల మంది ఉద్యోగులు.. యూనివర్సిటీలు, జాతీయ విద్యాసంస్థల్లో సుమారు 5వేల మంది అధ్యాపకులు, ప్రొఫెసర్లు పని చేస్తున్నారు. 55వేల మంది రిటైర్డు ఉద్యోగులున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి రూ.250 కోట్లు, పెన్షనర్లకు రూ.75 కోట్లు, ప్రతి నెలా జీతభత్యాలు, పింఛన్ల రూపంలో చెల్లిస్తుంటారు. కేంద్ర ప్రభత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు సుమారు రూ.400 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇక ప్రైవేటు సెక్టార్, అసంఘటిత రంగంలో సుమారు రెండులక్షల మంది ఉద్యోగులు, కార్మికులు ఉంటే వీరికి జీతభత్యాల రూపంలో రూ.150 కోట్ల వరకు చెల్లింపులు జరుగుతుంటాయని అంచనా. ఈ లెక్కన జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులు, కార్మికులకు రూ.900 కోట్లు అవసరం. మరో పక్క జిల్లాలో 3.24 లక్షల మంది సామాజిక పింఛన్‌దారులున్నారు. వీరికి ప్రతి నెలా 35.66కోట్లు అవసరం. సామాజిక పింఛన్‌దారుల్లో అకౌంట్లున్న 2.06 లక్షల మందికి వారి ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ చేసినట్టుగా అధికారులు చెప్పినప్పటికీ రెండో రోజు కూడా ఏ ఒక్కరికి పింఛన్ అందలేదు.

మరిన్ని వార్తలు