పోలీసుకు చిక్కిన పార్ధీ ముఠా

13 Aug, 2016 00:48 IST|Sakshi
పోలీసుకు చిక్కిన పార్ధీ ముఠా
నిజామాబాద్‌ అర్బన్‌ :ఇటీవల నిజామాబాద్‌ నగరంలో అపార్ట్‌ మెంట్లు, ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన పార్ధి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం 4వ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ ఆనంద్‌ కుమార్‌ విలేకరుల సమావేశంలో వివకాలు వెల్లడించారు. ఈనెల 4 న పార్ధీ ముఠా నగరంలోని మహాలక్ష్మీనగర్‌లో దొంగతనానికి వచ్చింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పార్ధీ ముఠాలోని రఘుబీర్‌సింగ్‌ను పట్టుకున్నారు. విచారణలో రఘుబీర్‌సింగ్‌ కొడుకు ఆకాశ్‌కాలే, అతని తమ్ముడు కొడుకు బాబుకాలే, మరో సభ్యుడు గంగగోకుల్‌ సిరియలు దొంగతనానికి పాల్పడినట్లు తెలిసంది.  2013లో హైదరాబాద్‌లోని కార్ఖానా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ఈ ముఠా 20 తులాల బంగారం , 50 తులాల వెండిని దొంగలించింది. 2015 లో హైదరాబాద్‌లోని ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దొంగతనాలకు పాల్పడి మూడున్నర తులాల బంగారం దొంగలించింది. దొంగల ముఠా వద్ద నుండి గుల్లేరు, కత్తిలను స్వాధీనం చేసుకున్నారు.
ఒకే కుటుంబ సభ్యులు.....
పార్ధీ ముఠా దొంగలు ఒకే కుటుంబానికి చెందిన దొంగల ముఠా మహారాష్ట్రలోని ఔరంగబాద్‌ జిల్లా పాడేగావ్‌ గ్రామానికి చెందినవారు. ఇందులో గంగగోకుల్‌సిరయ మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు ముర్ధాపూర్‌ గ్రామానికి చెందినవాడు. వీరు బెలూన్‌లను అమ్ముతూ కాలనీలు తిరుగుతారు. మధ్యాహ్నమంతా బెలూన్లు విక్రయిస్తు దొంగతనానికి పథకం రూపొందిస్తారు. అర్ధరాత్రి వేళ దొంగతనాలకు పాల్పడుతారు. ఒక దొంగతనం అనంతరం మరో జిల్లాకు , మరో ప్రాంతానికి వెళ్లిపోతారు. 
 
మరిన్ని వార్తలు