సాధనతోనే క్రీడాకారులకు భవిష్యత్‌

6 Jul, 2017 10:12 IST|Sakshi
సాధనతోనే క్రీడాకారులకు భవిష్యత్‌

ఆదిలాబాద్‌కల్చరల్‌: సాధనతోనే క్రీడాకారులకు మంచి భవిష్యత్‌ ఉంటుందని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో క్రీడాపాఠశాల అకాడెమికి ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన క్రీడాకారులు 34మంది హాజరు కాగా వయస్సు కారణంగా 15మందిని అనర్హులుగా గుర్తించి 15మందిని ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు సాధనతోనే మెరుగైన ఫలితాలు సాధిస్తారన్నారు. క్రీడాకారులు కష్టపడితే భవిష్యత్‌లో ఉన్నతస్థాయికి ఎదుగుతారని పేర్కొన్నారు. క్రీడా పాఠశాలల్లో చేరితే అన్ని రకాలుగా సౌకర్యాలుంటాయని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు