కేశవదాసుపాలెంలో గ్యాస్‌ లీక్‌

3 Oct, 2016 21:27 IST|Sakshi
సఖినేటిపల్లి : 
కేశవదాసుపాలెంలో ఉన్న నంబర్‌–11 ఓఎన్జీసీ బావికి సంబంధించిన గ్యాస్‌ పైపు సోమవారం ఉదయం లీకైంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక జీసీఎస్‌ నుంచి ఓఎన్జీసీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. లీకేజీ అదుపు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్రామంలోని చెల్లంకొండ పుత్రయ్య, నానికి చెందిన కొబ్బరితోటల సమీపంలో ఈ లీకేజీ ఏర్పడింది.
 
మరిన్ని వార్తలు