జిల్లాకు హరితమిత్ర అవార్డులు

13 Aug, 2016 16:20 IST|Sakshi
జిల్లాకు హరితమిత్ర అవార్డులు
నిజామాబాద్‌ అర్బన్‌ : జిల్లాకు హరితమిత్ర అవార్డులు వరించాయి. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితమిత్ర అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాకు రెండు అవార్డు దక్కాయి. సదాశివనగర్‌ మండలం గిద్ద జిల్లా ప్రజాపరిషత్, అగ్రికల్చరల్‌ మార్కెట్‌ కమిటీ ఆర్మూర్‌లు ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకోనున్నారు. ఈ అవార్డులను గిద్ద మాజీ ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి, అగ్రికల్చరల్‌ మార్కెట్‌ కమిటీ తరఫున డాక్టర్‌ శరత్‌ డైరెక్టర్‌ ఏఎంసీ అందుకోనున్నారు. కలెక్టర్‌ యోగితారాణా హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా చేపట్టారు. ప్రతి గ్రామం, మండలం, పట్టణ కేంద్రాలతోపాటు కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేశారు. దీంతో రాష్ట్రంలో హరితహారంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇందుకు కలెక్టర్‌ కృషి వల్ల హరితమిత్ర రెండు అవార్డు లభించాయి. ఈ అవార్డులకు సంబంధించి ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.ఆర్‌.మినా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
 
మరిన్ని వార్తలు