భారీ వర్షాలకు అతలాకుతలం

24 Sep, 2016 21:31 IST|Sakshi
భారీ వర్షాలకు అతలాకుతలం
చిట్యాల: 
చిట్యాల మండలంలో నాలుగు రోజులుగా కురిసిన వర్షానికి తీరని నష్టం సంభవించింది. మండల వ్వాప్తంగా 32 ఇండ్లు పాక్షికంగా కూలిపోగా, 3 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయినాయి. సుంకేనేపల్లి గ్రామానికి చెందిన ఆవుల అంజయ్యకు చెందిన పాడి గేదె మృతిచెందింది. ఇక మండలం వ్వాప్తంగా సుమారు వంద ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. వట్టిమర్తి, ఆరెగూడెం, తాళ్లవెల్లంలలో ఈ పంట నష్టం తీవ్రత అధికంగా ఉంది. ఇక మండలంలోని తాళ్లవెల్లంల శివారులోని పెద్ద చెరువుకు మిషన్‌కాకతీయలో పనులు నాణ్యతతో చేయకపోవటంతో కట్టకు గండి పడింది. దీంతో గ్రామస్తులు గండిని పూడ్చి వేశారు. ఇక మండలంలోని పెద్దకాపర్తి, వెలిమినేడు,గుండ్రాంపల్లి శివారులలోని చెరువులకు గల డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ల నిర్వహణ సరిగా లేకపోవటంతో వర్షపు నీరు  పక్క గ్రామాలకు వెళ్లింది. కాగా చిన్నకాపర్తి శివారులోని కోమటికుంట కట్ట బలహీనంగా ఉండటంతో నీరు చేరితే ఇబ్బందులు ఎదురవుతాయని వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ ఉపసర్పంచ్‌ రుద్రారపు శ్రీను కోరారు. కాగా ఇండ్లు కూలి పోయినవారికి,పంటలు నష్ట పోయిన వారికి పరిహారం చెల్లించాలని, బాధితులు, గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. కాగా, చిట్యాలలో కూలిన ఇళ్లను ఎంపీటీసీ కృష్ణ, వీఆర్వో సత్యనారాయణ పరిశీలించారు.
 
 
 
మరిన్ని వార్తలు