ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య

18 Jul, 2016 12:05 IST|Sakshi
ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య

చిలుకూరు
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యాశాఖ చేపట్టిన చర్యలు కొంతమేరకు సత్పలితాలను ఇచ్చాయి. ఈ విద్యా సంవత్సరం పలు సర్కార్‌ స్కూళ్లలో ప్రవేశపెట్టిన ఆంగ్ల మాద్యమం బాగానే కలిసొచ్చింది. గత ఏడాదితో చూస్తే ఈసారి 10 నుంచి 15 శాతం విద్యార్థుల సంఖ్య పెరిగింది.      చిలుకూరు
 గతంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సంఖ్య  విపరీతంగా ఉండేది.  కానీ, గత కొన్నేళ్లుగా వివిధ కారణాల వల్ల ఆ సంఖ్య తగ్గుముఖం పట్టింది. దీంతో గత ప్రభుత్వం సర్కార్‌ స్కూళ్ల బలోపేతానికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా సక్సెస్‌ స్కూళ్లను తీసుకువచ్చింది. కానీ వాటిని పకడ్బందీగా నిర్వహించకపోవడంతో ఆశించిన ఫలితం కనిపించలేదు. విద్యార్థుల లేమితో  ఒకానొక దశలో జిల్లాలోని పలు స్కూళ్లను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మేల్కొన్న విద్యాశాఖ..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి గల కారణాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. అం దులో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో బడిబాట, తదితర కార్యక్రమాలు చేపట్టింది.  ప్రభుత్వ పాఠశాలల గురించి, వాటిలో కల్పిస్తున్న వసతుల గురించి ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి విస్త్రృత ప్రచారం నిర్వహించారు.  ఇంగ్లిష్‌ మీడియం లేకపోవడం వల్లే ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపడం లేదని, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే స్థానికంగానే చదివిస్తామని  మెజార్టీ అభిప్రాయాలు వ్యక్తం కావడంతో విద్యాశాఖ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టింది.  ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చి పలు చోట్ల ఆ మేరకు అమలు చేస్తుండడంతో ఈ విద్యాసంవత్సరం పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.   జిల్లా వ్యాప్తంగా 610 జిల్లా పరిషత్, 310 ప్రాథమికోన్నత, 2900 ప్రాథమిక, 88 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉండగా ఈ విద్యా సంవత్సరం చాలా వరకు పాఠశాలలు విద్యార్థులతో కలకలలాడుతున్నాయి.
చిలుకూరు మండలంలో ఇలా..
చిలుకూరు  జిల్లా పరిషత్‌ పాఠశాలలో  ఈసా రి 50 మంది కొత్తగా చేరారు. అలాగే మండలంలోని బేతవోలు, జెర్రిపోతులగూడెం, కొండాపురం, నారాయణపురం, రామాపురం జిల్లా పరిషత్‌ స్కూళ్లలో, ఆర్లెగూడెం ప్రాథమికోన్నత, చిలుకూరు కేంద్ర ప్రాథమిక పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్య గణనీయంగానే పెరిగింది. ముఖ్యంగా జిల్లా పరిషత్‌ స్కూళ్లలో 10 నుంచి 15 శాతం పెరిగింది.  
ఇవి కూడా కారణాలే..
ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు కరువు, ప్రైవేట్‌ స్కూళ్లలో వసూలు చేస్తున్న విపరీతమైన ఫీజులు, డొనేషన్లు కూడా తోడయ్యాయి.  ప్రైవేట్‌ స్కూళ్లలో వేలవేలకు ఫీజు వసూలు చేస్తుండడంతో చాలా మందికి చెల్లించే స్థోమత లేక ప్రైవేట్‌ స్కూళ్లలో చేర్పించినట్లు తెలుస్తోంది.   
 

మరిన్ని వార్తలు