ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

3 Oct, 2016 18:10 IST|Sakshi
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

మిర్యాలగూడ టౌన్‌ : ఎస్సీవర్గీకరణ చట్టభద్ధతను కల్పించేంత వరకు ఉద్యమం ఆగదని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి పులిపాటి ప్రకాశ్‌మాదిగ, జిల్లా అధ్యక్షుడు కందుకూరి సోమయ్య అన్నారు. సోమవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో జరిగిన ఎమ్మార్పీఎస్‌ అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సమావేవానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మాణం చేసి వదిలేసిందని, కేంద్రంపై ఒత్తిడిని తీసుకొచ్చేందుకు కేసీఆర్‌ అఖిలపక్ష పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. నవంబరు 20న హైదరాబాద్‌లో 30లక్షల మంది దళితులతో మాదిగల ధర్మయుద్ధ మహాసభను నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6న నల్లగొండలోని బండారి గార్డెన్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంద కృష్ణమాదిగ హాజరవుతున్నారన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ ఏడుకొండలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి తలకొప్పుల సైదులు, ఇరుగు ఎల్లయ్య, నాయకులు ఉబ్బపల్లి రాజశేఖర్, రామ్‌లక్ష్మణŠ  తదితరులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు