నయీమ్‌ కేసును సీబీఐకి అప్పగించాలి

3 Oct, 2016 18:12 IST|Sakshi
నయీమ్‌ కేసును సీబీఐకి అప్పగించాలి

–టీ యూవీ కన్వీనర్‌ చెరుకు సుధాకర్‌
తిరుమలగిరి : నయీమ్‌  డైరీలో ఉన్న నేతల పేర్లు బయట పెట్టాలని.. లేదంటే ఆ కేసును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ ఉద్యమ వేదిక (టీయూవీ) రాష్ట్ర కన్వీనర్‌ చెరుకు సుధాకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం తిరుమలగిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నÄæూమ్‌ కేసు విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా డైరీలో ఉన్న ప్రజా ప్రతినిధులను, పోలీసులను కఠినంగా శిక్షించాలన్నారు. లేనిచో సుప్రీంకోర్టు జడ్జిచే విచారణ చేపట్టాలని కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా జిల్లాల, మండలాల పునర్విభజన ఉండాలని కోరారు. రాష్ట్రంలో విష జ్వరాలతో వేలాది మంది చనిపోతున్నారని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక వైద్యం సరిగా అందడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని ఆరోపించారు. మిషన్‌ కాకతీయ, భగీరథ, ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లలో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏపూరి సోమన్న, గఫార్‌ఖాన్, ఎర్ర ప్రశాంత్, రమేష్, రాము గౌడ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.



 

మరిన్ని వార్తలు