హైవేపై లారీ బోల్తా

15 Jul, 2013 17:10 IST|Sakshi
హైవేపై లారీ బోల్తా

కడియం, న్యూస్‌లైన్ : రోడ్డు దాటుతున్న సైక్లిస్ట్‌ను టమాటా లోడుతో వెళుతున్న లారీ ఢీకొని బోల్తా కొట్టిం ది. కడియం మండలం పొట్టిలంక వద్ద జరిగి న ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా నుంచి శ్రీకాకుళానికి టమాటా లోడుతో లారీ వెళుతోంది. హైవేపై పొట్టిలంక వద్దకు వచ్చేసరికి సైకిల్‌పై రోడ్డు దాటుతున్న కడి యం మండలం దుళ్ల గ్రామానికి చెందిన గుమ్మాల ఎరుకలనాయుడు (70)ను ఢీకొట్టింది. డ్రైవర్ కంగారుపడడంతో లారీ అదుపుతప్పి హైవేపై బోల్తా కొట్టింది. నాయుడిని స్థానికులు ఆటోలో రాజమండ్రిలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కూలి పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైనట్టు స్థానికులు తెలిపారు. తలకిందులైన లారీ కేబిన్‌లో డ్రైవర్ ఎస్. పంతునాయక్ చిక్కుకుపోయాడు.

అత డి కాళ్లు మాత్రమే బయటకు కనిపించాయి. తనను రక్షించండంటూ డ్రైవర్ నాయక్ ఆర్తనాదాలు చేశాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు లారీ వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేబిన్‌లోని చెక్కలను తొలగించారు. అనంతరం సమీపంలో పనిచేస్తున్న పొక్లెయిన్‌ను అక్కడకు రప్పించారు. దాని సాయంతో డ్రైవర్‌ను బయటకు తీశారు. అతడి కుడి కాలికి గాయం కావడంతో 108లో ఆస్పత్రికి తరలించారు. తనను రక్షించిన స్థానికులకు డ్రైవర్ కృతజ్ఞతలు తెలిపాడు. లారీ కేబిన్‌లో మరో ఇద్దరు ఉన్నారని సైక్లిస్ట్‌ను ఢీకొట్టడంతోనే వారిద్దరూ కిందికి దూకేశారని డ్రైవర్ చెబుతున్నాడు. వారికి ఏ విధమైన గాయాలు కాలేదని స్థానికులు చెబుతున్నారు. క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సుమారు వందమీటర్ల దూరంలో సైక్లిస్ట్‌ను లారీ ఢొకొట్టడం చూసిన చేపలు అమ్మేవారు బుట్టలను అక్కడే వదిలేసి పరుగులు తీశారు.

బుట్టలకు ఎదురుగా వచ్చి రోడ్డుపై లారీ తిరగబడింది. ఆదివారం సాయంత్రం మార్కెట్ కావడంతో ఆ సమయంలో సుమా రు వంద మంది వరకు అక్కడ ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద స్థలాన్ని రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ పి. రవికుమార్ మూర్తి సందర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ బూత్‌లు తనిఖీ చేస్తున్న ఆయన విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. డీఎస్పీ శ్రీదేవీరావు, కడియం ఇన్‌స్పెక్టర్ దేవరకొండ ప్రసాద్ ఉన్నారు. హైవే పెట్రోలింగ్, అథారిటీ సిబ్బంది అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.
 

మరిన్ని వార్తలు