దోమలపై దండయాత్ర షురూ

24 Sep, 2016 17:48 IST|Sakshi
దోమలపై దండయాత్ర షురూ

కడప ఎడ్యుకేషన్‌:
దోమలపై దండయాత్ర ప్రారంభమైందని దోమల నిర్మూలను ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో యుద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ, జేసీ శ్వేత పిలుపునిచ్చారు. కడప నగరం కోటిరెడ్డి సర్కిల్‌ సమీపంలోని రాష్ట్ర అతి«థి గృహం వద్ద శనివారం విద్యా, వైద్యశాఖల సంయుక్త ఆధ్వర్యంలో దోమలపై దండయాత్రకు సంబంధించిన ర్యాలీని వారు ప్రారంభించి మాట్లాడారు. దోమల నివారణకు ప్రతి ఒక్కరూ వారానికి ఒక రోజు ఖచ్చితంగా డ్రైడేని నిర్వహించాలన్నారు. ఆ రోజు ఎక్కడ నీటి నిల్వలు లేకుండా చేసి ఆరబెట్టాలన్నారు. దీంతోపాటు పరిపరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు చెత్తాచెదారం పేరుకోకుండా చూడాలన్నారు. నీళ్లు తొట్లు, ట్యాంకులపై ఖచ్చితంగా మూతలను వాడాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఈ ర్యాలీలో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, నర్సింగ్‌ విద్యార్థులు, విద్య,  వైద్య సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ కొటిరెడ్డి సర్కిల్‌ నుంచి ఏడు రోడ్ల కూడళి వరకూ సాగింది. అనంతరం ఏడు కోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించి నినాదాలు చేశారు.  ఈ ర్యాలీ కార్యక్రమంలో జిల్లా విద్యాశాకాధికారి బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి, నరగపాలక కమీషనర్‌ చంద్రమౌళీశ్వరెడ్డి,  డిప్యూటీ ఈఓ ప్రసన్నాంజనేయులు, డీఎంహెచ్‌ఓ రామిరెడ్డి,అడిషినల్‌ డీఎంఅండ్‌హెచ్‌ఓలు చంద్రశేఖర్, అరుణసులోచన,  జిల్లా ఆరోగ్య విద్యాధికారి వైద్యాధికారి గుణశేఖర్, జిల్లా స్టాటికల్‌ అధికారి ఉమామహేశ్వరెడ్డి,టి బి అధికారి ఉమమహేశ్వర్, జల్లా మలేరియా అధికారి త్యాగరాజు,  వైద్యసిబ్బంది వెంగల్‌రెడ్డి, ఆపూస్మ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 
 

మరిన్ని వార్తలు