బెంగళూరులో జికా వైరస్‌ కలకలం

2 Nov, 2023 12:26 IST|Sakshi

బెంగళూరు: బెంగళూరు సమీపంలో జికా వైరస్ కలకలం రేపింది. ఓ వ్యక్తికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిక్కబళ్లాపూర్ పరిధిలోని ఓ దోమలో జికా వైరస్‌ బయటపడినట్లు ఇప్పటికే వైద్యులు తెలిపారు. దీంతో తెల్కబెట్టా పరిధిలోని ఐదు కిలోమీటర్ల మేర వైద్య ఆరోగ్యశాఖ అలర్డ్ జారీ చేసింది. అనుమానాస్పద జ్వరం కేసులను పరీక్షలకు పంపాలని ఆదేశించారు. 

'రాష్ట్రమంతా కలిపి దాదాపు 100 శాంపిళ్లను పరీక్షలకు పంపాం. చిక్కబళ్లాపూర్‌ నుంచి వచ్చిన ఆరు కేసుల్లో ఒకటి మాత్రమే పాజిటివ్‌గా నమోదైంది.' అని జిల్లా ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్ ఎస్‌ మహేశ్ తెలిపారు. అత్యధిక జ్వరం లక్షణాలు ఉన్న ముగ్గుర్ని పర్యవేక్షణలో ఉంచామని చెప్పారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. 

ఏడెస్ దోమ కాటు ద్వారా జికా వైరస్ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది డెంగ్యూ, చికున్‌గున్యా వంటి ఇన్‌ఫెక్షన్లకు కూడా కారణమౌతుంది . 1947లో ఉగాండాలో తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. గత డిసెంబర్‌లో కర్ణాటకాలోని రాయ్‌చూర్‌ జిల్లాలో ఐదేళ్ల బాలునికి  జికా వైరస్ సోకింది. మహారాష్ట్రాలోనూ మరో వ్యక్తి దీని బారిన పడ్డారు. 

ఇదీ చదవండి: అమానవీయం: రక్తపు మడుగులో ఫిల్మ్‌మేకర్‌.. ఫోన్, కెమెరా దొంగతనం


 

మరిన్ని వార్తలు