కాపుల చుట్టూ పోలీసు కాపలా

25 Jan, 2017 00:04 IST|Sakshi
  • గృహ నిర్బంధాల్లో కాపు ఉద్యమ నేతలు
  • పోలీసు వలయాల్లో కాపు ఉద్యమ ప్రభావిత గ్రామాలు
  • 144 సెక్ష¯ŒS పేరుతో పాదయాత్ర అణచివేతకు వ్యూహం
  • కోనసీమలో డీఐజీ రామకృష్ణ మకాం
  • పాదయాత్రకు బయలుదేరిన ముద్రగడను అడ్డుకున్న పోలీసులు
  • స్వేచ్ఛ కల్పించినప్పుడే తిరిగి ప్రారంభిస్తానని ప్రకటించిన పద్మనాభం
  • సాక్షి, రాజమహేంద్రవరం/ అమలాపురం టౌన్‌ :

    కాపుల పాదయాత్ర అణచివేతకు అవకాశం ఉన్న అన్ని వ్యూహాలనూ పోలీసు యంత్రాంగం అమలు చేసింది. కాపు నేతల ఇళ్లచుట్టూ భారీగా పోలీసులు మోహరిం చారు. వారిని గృహ నిర్బంధాలతో నిలువరించారు. కాపుల చుట్టూ  పోలీసు కాపలా పెట్టి కనీసం కాలు కూడా కదపలేనంతగా ఇళ్లకు పరిమితం చేసి, యాత్రకు కదిలి వెళ్లేందుకు వీలు లేకుండా 
    హౌస్‌ అరెస్ట్‌లు చేసేశారు. కిర్లంపూడి, అమలాపురం, గోపాలపురం, కాకినాడ రూరల్‌ తదితర ప్రాంతాల్లో కాపు ఉద్యమ నేతలను పోలీసులు మంగళవారం ఉదయమే వారి ఇళ్లను పోలీసులు చుట్టుముట్టారు.  అమలాపురంలో కాపు ఉద్యమ నేతలైన రాష్ట్ర కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు కల్వకొలను తాతాజీ, నల్లా పవ¯ŒSను, రావులపాలం మండలం గోపాలపురంలో రాష్ట్ర కాపు జేఏసీ జాయింట్‌ కన్వీనర్‌ ఆకుల రామకృష్ణ, కాకినాడ రూరల్‌లో మరో జేఏసీ జాయింట్‌ కన్వీనర్‌ వాసిరెడ్డి ఏసుదాసుతోపాటు కోనసీమలో మండల స్థాయి కాపు నేతలు మొత్తం 35 మంది ఉద్యమ ప్రతినిధులను హౌస్‌ అరెస్ట్‌లు చేశారు. కాపు జేఏసీ నాయకుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గుండా వెంకటరమణను పిఠాపురంలో గృహ నిర్బంధంలో ఉంచారు.
    కోనసీమలో పోలీస్‌ పికెట్‌లు...
    కోనసీమలో పాదయాత్ర  సాగే 11 మండలాల్లోని యాత్ర రూట్‌ మ్యాప్‌నకు అనుగుణంగా పర్లాంగుకో పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆరు వేల మంది పోలీసులను మోహరించారు. రాయలసీమ, నెల్లూరు, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు. కోనసీమలోని వచ్చే దారులన్నింటినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోనసీమ ప్రవేశ మార్గాలైన గోదావరి వంతెనలపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ల వద్ద ప్రతి వాహనం తనిఖీ చేసిన తర్వాతే లోనికి పంపిస్తున్నారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ రామకృష్ణ కోనసీమలోనే గత రెండు రోజులు మకాం చేశారు. రావులపాలెం, అమలాపురంలో మంగళవారం వరస సమీక్షలు నిర్వహించారు. 40 మంది డీఎస్పీలు, వంద మందికి పైగా సీఐలు, 500 మందికి పైగా ఎస్సైలు బందోబస్తులో నిమగ్నమయ్యారు.
    రావులపాలేన్ని జల్లెడ పడుతున్న పోలీసులు
    యాత్ర రావులపాలెం నుంచే ప్రారంభించనున్న దృష్ట్యా జాతీయ రహదారిపై ఆ గ్రామం కీలకంగా మారింది. ఉద్యమ నేతలు ఇక్కడకు వచ్చి యాత్రకు శ్రీకారం చుట్టాల్సి ఉండటంతో ఆ గ్రామాన్ని పోలీసులు పూర్తిగా జల్లెడ పడుతున్నారు. కాపు నేతలే కాదు...ఉద్యమాల్లో తిరుగుతున్న కాపులను కూడా రావులపాలెంలో అడుగు పెట్టకుండా దారులన్నీ మూసివేసి తనిఖీ చేస్తున్నారు. రావులపాలెం పరిసర గ్రామాలు కూడా పోలీసుల పహారాలో ఉన్నాయి. బుధవారం ఉదయం ఏం జరుగుతోందని జిల్లా అంతటా ఉత్కంఠగా ఉంది. అయితే కాపు నేతల వద్ద ఇప్పటికే షాడో పార్టీలు మప్టీలో ఉండటం...తాజాగా ఇళ్లను చుట్టిముట్టడంతో పోలీసులు ఈ నేతలను పూర్తిగా తమ అదపులో ఉంచుకోవటంతో యాత్ర జరిగే ప్రసక్తే లేదన్న ధీమాతో పోలీసు శాఖ ఉంది.
     
    ఆకుల అరెస్టుకు నిరసనగా నేడు బంద్‌ 
    రావులపాలెం : ముద్రగడ పాదయాత్ర నేపధ్యంలో కాపు జేఏసీ నేత ఆకుల రామకృష్ణను పోలీసులు గృహ నిర్భంధం చేయడాన్ని నిరసిస్తూ బుధవారం రావులపాలెం మండలంలోన బంద్‌ పాటిస్తున్నట్టు మండలం కాపు సంఘం అధ్యక్షుడు సాధానాల శ్రీనివాస్‌ మంగళవారం  ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ముద్రగడ చేస్తున్న ఉద్యమాన్ని పోలీసులతో నీరుగార్చాలని చూస్తుందన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రజలు బంద్‌కు సహకరించాలని కోరారు.  
     
    పోలీసు పహారాల్లో కాపు ఉద్యమ ప్రభావిత గ్రామాలు...
    జిల్లాలో కాపు ఉద్యమాన్ని ప్రభావితం చేస్తున్న కిర్లంపూడి, కోనసీమలో దాదాపు 160 గ్రామాలు పూర్తిగా పోలీసు పహారాలో ఉన్నాయి. ఆయా గ్రామాల నుంచి ఎవరైనా కాపులు యాత్రకు బయలుదేరేలా ఉన్నట్లు సమాచారం అందితే చాలు వారిని తక్షణమే అదుపులో తీసుకునేందుకు పోలీసులు కాపు కాçచుకుని ఉంటున్నారు. డ్రోన్, బాడీ హోల్డ్‌ కెమెరాలను అందుబాటులో ఉంచారు.
     
    హోం మంత్రి ఇలాకాలో భారీ బందోబస్తు 
    ఉప్పలగుప్తం (అమలాపురం) : మండలం పోలీస్‌ వలయంలో ఉంది. పోలీస్‌ బలగాలు గ్రామాల్లో మంగళవారం పెద్ద ఎత్తున మోహరించాయి. ఉప ముఖ్యమంత్రి, హోం శాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత మండలం కావడంతో ఉప్పలగుప్తంలో పోలీస్‌ అదనపు బలాగాల హడావుడి ఎక్కవుగా ఉంది. మండలంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కాపు నాయకుల కదలికలపై నిఘా పెట్టారు.
     
మరిన్ని వార్తలు