పట్టణ ఆరోగ్య కేంద్రాల ప్రైవేటీకరణ దుర్మార్గం

1 Aug, 2016 02:01 IST|Sakshi
ఏలూరు (మెట్రో): పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేటీకరించే జీవో 43ను రద్దు చేయాలని, 16 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని కొనసాగించాలని కోరుతూ పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బంది యూనియన్‌ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. యూనియన్‌ జిల్లా సమావేశం సీహెచ్‌ పోశీరత్నం అధ్యక్షతన స్థానిక పవరుపేటలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. యూనియన్‌ గౌరవాధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడుతూ పట్టణాల్లోని మురికివాడల ప్రజలకు సేవలందిస్తున్న పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం జీవో విడుదల చేయడం దుర్మార్గమన్నారు. దీని వల్ల పేదలపై భారం పెరుగుతుందని, సిబ్బందికి ఉద్యోగ భద్రత ఉండదన్నారు. ఎన్‌.దుర్గాంజలి, పి.మహాలక్ష్మి, ఝాన్సీలక్ష్మి, అరుణ, వెంకటలక్ష్మి,  విజయకుమారి, అప్పాయమ్మ, విక్టోరియా పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు