ప్రైవేట్‌ కళాశాలల్లో విజిలెన్స్‌ తనిఖీలు

6 Aug, 2016 00:15 IST|Sakshi
నెల్లికుదురు : మండల కేంద్రంలోని ప్రయివేటు జూని యర్‌ కళాశాలల్లో శుక్రవారం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్స్‌ ఏఎస్పీ సురేందర్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. స్థానిక వివేకానంద జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తనిఖీలు నిర్వహించారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం మౌలిక వసతులు, కళాశాల ఆట స్థలం, విద్యార్థులకు అనుగుణంగా క్లాస్‌రూంలు, అధ్యాపకులు, ఫీజ్‌ రీయింబర్స్‌మెంటు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి ప్రభుత్వానికి రహస్య నివేదికను అందించనున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక మార్గదర్శి కళాశాల మూసివేసి ఉండడంతో 2014 నుంచి 2016 వరకు కళాశాల రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐడీ ఎస్సై రమేష్, ఏఈ సుగుణాకర్‌రావు, అధ్యాపకుడు అంజయ్య, జూనియర్‌ అసిస్టెంటు వేణుకుమార్, సిబ్బంది రమేష్, అఫ్జల్‌ పాల్గొన్నారు.
కొడకండ్లలో..
కొడకండ్ల : మండల కేంద్రంలోని ప్రైవేటు కళాశాలల్లో శుక్రవారం విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహిం చారు. సాయి డిగ్రీ కళాశాల, శ్రీవెంకటేశ్వర జూనియర్‌ కళాశాలల్లో విజిలెన్స్‌ ఏజీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కళాశాల రికార్డులు, మౌలిక వసతులు, విద్యార్థుల సంఖ్య, అధ్యాపకుల అర్హతలు తదితర అంశాలను పరిశీలించారు. కళాశాలల స్థితిగతులపై నివేదిక రూపొందించి జిల్లా అధికారులకు అందించనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడు ధనుం జయ్‌ తదితరులు పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు