ఉద్యోగుల కేటాయింపులు తాత్కాలికమే

2 Sep, 2016 23:45 IST|Sakshi
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌
  • పునర్విభజన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌
  • ఖమ్మం జెడ్పీసెంటర్‌ : జిల్లా పునర్విభజనలో కొత్త జిల్లాకు అధికారులు, సిబ్బందిని తాత్కాలికంగానే కేటాయించనున్నామని జిల్లా కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో పునర్విభజన పర్యవేక్షక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌ మాట్లాడుతూ కొత్త జిల్లాకు కేటాయింపులు ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జరపాలని సూచించారు. ఆయా శాఖలు తమ తమ జాబితాను ఇష్ట ప్రకారంగా సమర్పించినందున అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. నమూనాలో కార్యాలయ వసతి, సిబ్బంది, ఫైళ్ల వివరాలు, ఫర్నిచర్‌ సంబంధిత వివరాలు అందించాలని కోరారు. ఫైళ్ల నమూనాలో గార్ల, బయ్యారానికి సంబంధించిన ఫైళ్లు ఉంటే వాటిని వేరుగా చూపించాలని చెప్పారు. అన్ని శాఖలకు సంబంధించిన సమాచారం క్రోడీకరించి ప్రభుత్వానికి పంపిస్తామని, అక్కడ ఏ నమూనాలో అడిగినా పంపించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయా శాఖలకు సంబంధించిన జాబితాలను పరిశీలించారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈఓ మారుపాక నాగేశ్, జిల్లా రెవెన్యూ అధికారి బి.శ్రీనివాస్, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, సీపీఓ రాందాస్, డీఆర్‌డీఏ పీడీ మురళీధర్‌రావు, సమాచార శాఖ ఏడీ ముర్తుజా, మెప్మా పీడీ వేణుమనోహర్‌రావు పాల్గొన్నారు.
     
     
మరిన్ని వార్తలు