రైతు ‘బంద్‌’

10 Jan, 2017 03:45 IST|Sakshi
రైతు ‘బంద్‌’

ఒంగోలు టూటౌన్‌ :   రైతుబంధు పథకం అధికారుల నిర్లక్ష్యంలో నీరుగారుతోంది. ప్రచార లోపంతో అన్నదాత దరిచేరడంలేదు.  గత ఆరు సంవత్సరాలలో ఈ పథకం కింద కొద్ది మంది రైతులే రుణాలు పొందారంటే ఈ పథకంపై ప్రచారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  పథకం ప్రవేశపెట్టి ఏళ్లు గడుస్తున్నా రైతుల చెంతకు నేటికి చేరనేలేదు. రైతులకు ఎంతో ప్రయోజనకరమైన ఈ పథకం అమల తీరుపై సాక్షి కథనం..  
        
మార్కెట్‌ యార్డుకు తరలిస్తున్న సమయంలో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం ఉంది.  రైతు రూ. లక్ష వరకు బీమా  పొందవచ్చు.  నిల్వ చేసిన పంట ఉత్పత్తులకు 75 శాతం వరకు రుణం అందజేస్తారు. మూడు నెలల వరకు ఎలాంటి రుణం వసూలు చేయరు. మార్కెట్‌ యార్డులలో పెట్టిన పంట ఉత్పత్తులకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది.  

పథకంపై కొరవడిన అవగాహన:
ఏతలు నాడు ఉన్న ఉత్పత్తి ధరలు కోతల నాటికి తగ్గిపోతున్నాయి. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందని పరిస్థితి. అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. కాలం గాని కాలంలో ధరలు రోజురోజుకీ పెరుగుతున్నా.. రైతులకు మాత్రం దక్కడం లేదు. ఇళ్లలో నిల్వ చేసుకునే సామర్ధ్యం లేక చాలా మంది రైతులు పంట ఉత్పత్తులను తెగనమ్ముకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్‌ యార్డు సౌకర్యం, రైతుబంధు పథకం లాభాల గురించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేస్తే పథకాన్ని ఉపయోగించుకుంటారు. కానీ వ్యవసాయ మార్కెట్‌ శాఖ అధికారులు ప్రచారాన్ని కరపత్రాలకే పరిమితం చేస్తున్నారు. ఏదోఒక సందర్భంలో రైతులతో జరిగే సమీక్షలలో  ఒకటి, రెండు మాటలు చెప్పి కాలం వెళ్లబుచ్చుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు అన్నదాత దరి చేరటంలేదు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.  

ప్రచారం కల్పిస్తున్నాం:
రైతు బంధు పథకంపై విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి రూ.86.40 లక్షలను రైతులకు స్వల్పకాలిక రుణాలుగా అందించాం. పంట కోతల అనంతరం గిట్టుబాటు ధర లేనిపక్షంలో పథకం ఉపయోగించుకునేలా   రైతులను చైతన్యవంతం చేస్తామని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ఏడీ సయ్యద్‌ రఫీ అహ్మద్‌ తెలిపారు.  

పథకం ఉద్దేశం:
రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసుకుని, రుణం మంజూరు చేసి వారిని ఆదుకోవడమే ఈ పథకం ఉద్దేశం. ముందుగా  రైతులు  ధాన్యాన్ని మార్కెట్‌ యార్డులలో నిల్వ చేసుకోవాలి. గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులు తమ ఉత్పత్తులను యార్డుల్లో ఉంచుకోవచ్చు.  మార్కెట్‌ కమిటీలలో తనఖా ఉంచిన ధాన్యం విలువలో 75 శాతం వరకు రుణ సౌకర్యం కల్పిస్తారు. గతంలో లక్ష రుణం మంజూరు చేసేవారు.  రెండేళ్ల క్రితం రుణ సదుపాయం దాదాపు రూ.2 లక్షల వరకు పెంచారు.   ఏఎంసీల ద్వారా స్వల్పకాలిక రుణాలుగా ఇస్తారు.  ఇటువంటి రుణాలకు 180 రోజుల వరకు  ఎటువంటి వడ్డీ ఉండదు. అనంతరం 181వ రోజు నుంచి 270వ రోజు వరకు స్వల్పంగా 12 శాతం వడ్డీని చెల్లించవలసి ఉంటుంది.  

ప్రస్తుతం పథకం అమలుపరిస్థితి:  
ఆరేళ్లుగా ఈ పథకం ఆశించిన స్థాయిలో రైతుల దరి చేరలేదు. 2010–11లో 103 మంది మాత్రమే వినియోగించుకున్నారు. 2011–12 లో కేవలం 78 మాత్రమే ఉపయోగించుకోగా.. 2012–13 లో  70 మంది లబ్ధిపొందారు. 2013–14లో 97 మంది రైతులు వినియోగించుకోగా..2014–15 ఆర్ధిక సంవత్సరంలో 117 మంది రైతులు ఈ పథకం కింద రుణాలు పొందారు. 2015–16లో 91 మంది రైతులకే పరిమితమైంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌ నాటికి కేవలం 61 మంది రైతులు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. మొత్తం మీద గడిచిన ఆరేళ్లలో కేవలం 600 మందికి మాత్రమే ఈ పథకం ఉపయోగపడింది.  జిల్లాలో ఆరు లక్షల వరకు రైతులు ఉంటే ఎంతో ప్రయోజనకరమైన ఈ పథకం ఏ కొద్ది మందికో  ఉపయోగపడిందంటే పథకం ఏ స్థాయిలో నీరుగారుతోందో తెలుస్తోంది.  

రైతుకు ఎన్నో లాభాలు:
వరి, మొక్కజొన్న, పెసర, ఆముదం, పొద్దుతిరుగుడు, ఉలవలు వంటి వ్యవసాయ ఉత్పత్తులకు రైతుబంధు పథకంలో స్థానం కల్పించారు. రైతులు పండించిన పంటను

మరిన్ని వార్తలు