శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ. 4.75 లక్షలు విరాళం

26 Sep, 2016 20:39 IST|Sakshi
ద్వారకాతిరుమల :  శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఇద్దరు భక్తులు సోమవారం వేరువేరుగా రూ. 4.75 లక్షలను విరాళంగా అందజేశారు. ఇందులో భాగంగా భీమవరంకు చెందిన దాసరి వెంకటేశ్వరరావు తన అన్న, వదినలు శ్రీరామ్మూర్తి, నాగమణిల పేరున రూ. 3,75,000 లను అన్నదాన ట్రస్టులో జమచేశారు. అలాగే విజయవాడకు చెందిన దుద్దుకూరి వెంకట శాంతకుమార్‌ తన తల్లిదండ్రులు, కుమారుడి పేరున రూ. 1,00,002 లను విరాళంగా అందజేశారు. దాతలు ముందుగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తరువాత  ఈ విరాళాలను అన్నదాన ట్రస్టులో జమచేయగా దాతలకు ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు, ఏఈవో కర్రా శ్రీనివాసరావులు బాండ్‌ పత్రాలను అందజేసి, అభినందించారు. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు