ఎస్కేయూలో యోగా డిప్లొమా కోర్సు

5 Aug, 2017 22:02 IST|Sakshi

ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో యోగా డిప్లొమా కోర్సును 2017–18లో అందుబాటులోకి తీసుకరావాలని వీసీ ప్రొఫెసర్‌ కే.రాజగోపాల్‌ అధికారులను ఆదేశించారు. వర్సిటీలోని పాలకభవనంలో శనివారం స్పోర్ట్స్‌ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వీసీ అధ్యక్షత వహించి మాట్లాడారు. యోగా కోర్సుకు సంబంధించి త్వరగా  సిలబస్‌ రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. వినూత్నమైన పద్దతులు నిర్వహించకపోవడం వల్ల విద్యార్థులు క్రీడల పట్ల మక్కువ చూపలేదన్నారు. అంకితభావంతో కృషి చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు.

అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తాం.. విద్యార్థులు క్రీడల పట్ల మక్కువ పెంపొందేలా ప్రోత్సాహాలు కల్పించాలన్నారు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కార్యక్రమాలను వెంటనే ముమ్మరం చేయలన్నారు. క్రీడలను వర్సిటీ విద్యా ప్రణాళికలో భాగం చేయాలన్నారు. అనంతరం రెక్టార్‌ ప్రొఫెసర్‌ హెచ్‌.లజిపతిరాయ్‌ మాట్లాడుతూ.. వర్సిటీలో స్పోర్ట్స్‌ కల్చర్‌ పెరిగే విధంగా  ఈ రంగంలోని సెలబ్రటీలను ఆహ్వానించాలన్నారు. అనంతరం 2017–18లో జరిగే క్రీడాపోటీల షెడ్యూల్‌ను ఆమోదించారు.

మరిన్ని వార్తలు