బీటెక్‌ కౌన్సిలింగ్‌కు యమ్‌ఈసీ ఆహ్వానం

4 May, 2020 20:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ ఇంటర్నేషనల్‌ టెక్నాలజీ స్కూల్‌ మహీంద్ర ఎకోల్‌ సెంట్రల్‌ (ఎమ్‌ఈసీ), హైదరాబాద్‌ లో బీటెక్‌ 2020-2024 విద్యాసంవత్సరానికి సంబంధించి ​కౌన్సిలింగ్‌ జరగనుంది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌  కొనసాగుతుండటంతో బీటెక్‌ అడ్మిషన్ల కోసం జరిగే కౌన్సిలింగ్‌ విధానాన్ని పూర్తిగా ఆన్‌లైన్‌లోనే చేపట్టనున్నారు. కౌన్సిలింగ్‌ అడ్మిషన్ల కోసం విద్యార్ధులు  www.mahindraecolecentrale.edu.in లో మే10 వరకు అప్లై చేసుకోవచ్చు. జనవరి లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌లో వచ్చిన పర్సన్‌టైల్‌ ఆధారంగా ఆడ్మిషన్లు ఇ‍వ్వడం జరుగుతుందని ఎమ్‌ఈసీ తెలిపింది. దీనికి సంబంధించిన ప్రెస్‌ నోట్‌ను సోమవారం యమ్‌ఈసీ విడుదల చేసింది. 

యమ్‌ఈసీలో ఇంజనీరింగ్‌కి సంబంధించిన నాలుగు బ్రాంచ్‌లకు(సివిల్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్)240 సీట్లు( ఒక్కో బ్రాంచ్‌కు 60 సీట్లు )ఉన్నాయి.భవిష్యత్తులో ప్రపంచశ్రేణి ఇంజనీరింగ్ పట్టభద్రులను అందించాలనే ఉద్దేశంతో మహీంద్రా గ్రూప్ సంస్థ ప్రారంభించిన ఇంజనీరింగ్ కాలేజ్.. మహీంద్రా ఎకోల్ సెంట్రల్. అకడెమిక్ సిలబస్, కరిక్యులం రూపకల్పన, బోధన, ఇతర శిక్షణ అంశాలకు సంబంధించి.. ఫ్రాన్స్‌కు చెందిన 185 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ ఇన్‌స్టిట్యూట్ ఎకోల్ సెంట్రల్-ప్యారిస్, మన రాష్ట్రంలోని జేఎన్‌టీయూ(హైదరాబాద్)లతో ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్‌లో ఈ కాలేజ్‌ను ఏర్పాటు చేశారు.

టెక్ మహీంద్రా సంస్థ ప్రాంగణంలోనే 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాలేజ్‌కు మౌలిక సదుపాయాలు కల్పించారు. దీనికోసం సంస్థ ప్రారంభంలో రూ.300 కోట్లు కేటాయించింది. భవిష్యత్తు అవసరాలకు సరితూగే విధంగా ప్రతి విద్యార్థికి రీసెర్చ్ ఓరియెంటెడ్ స్కిల్స్, ప్రాక్టికల్ అప్రోచ్ మెళకువలను అందిస్తారు. తద్వారా కోర్సు పూర్తయ్యేనాటికి మంచి నైపుణ్యాలు ఉన్న ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతారు. ప్రతి విద్యార్థి కోర్సు సమయంలో ఆరు నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎకోల్ సెంట్రల్ ప్యారిస్‌కు వెళ్లే అవకాశం లభిస్తుంది. మీరు కూడా ఈ సంస్థలో చేరాలనుకుంటే మే 10లోపు కౌన్సిలింగ్‌కు ఆప్లై చేసుకోండి. 10+2 లొ  60 శాతం పైగా మార్క్‌లు సాధించి,జేఈఈ మెయిన్స్‌లో అర్హత సంపాదించిన  వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు