ప్రాదేశిక పోరులో గెలుపు మాదే

30 Mar, 2014 23:19 IST|Sakshi

క్సీసర,న్యూస్‌లైన్:  జెడ్పీటీసీ,ఎంపీటీసీ ,సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్లార్ కోరారు. ఆదివారం మండలంలోని నాగారం , దమ్మాయిగూడ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. అనంతరం నాగారంలో గల ముప్పుఎల్లారెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో  ఆయన మాట్లాడారు.

అభివృద్ధి, సంక్షేమం రెండు జరుగాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. నగరానికి చేరువలోఉన్న నాగారం,దమ్మాయిగూడ గ్రామాలకు రూ.3 కోట్లతో  కృష్ణానీటిని అందిస్తామన్నారు.  కుషాయిగూడ-నాగారం రోడ్డువిస్తరణ , లోఓల్టేజీ నివారణకు నాగారంలో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జవహర్‌నగర్ చెత్త డంపింగ్‌ను ఇక్కడి నుంచి తరలించే విధంగా రానున్న రోజుల్లో  పోరాటం చేస్తానన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్‌ప్రభుత్వమేనన్నారు.
 
నాగారం, చీర్యాల, ఆర్‌జికే తదితర గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన  200 మంది  కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెన్నమరాజు ప్రభాకర్‌గౌడ్, నేతలు ముప్పురాంరెడ్డి, కందాడి భూపాల్‌రెడ్డి, తటాకం నారాయణశర్మ, జెడ్పీటీసీ అభ్యర్థి తటాకం పద్మ,మాజీ సర్పంచ్ అశోక్‌గౌడ్, నేతలు తటాకం వెంకటేష్,కందాడిస్కైలాబ్‌రెడ్డి, గూడూరు మహే ష్,  ఆంజనేయులు తదితరులున్నారు.

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి