బ్యూటిప్స్‌

16 Jun, 2018 00:15 IST|Sakshi

కోడిగుడ్డులోని తెల్లసొనలో టీస్పూన్‌ పంచదార, పావు టీ స్పూన్‌కార్న్‌ ఫ్లోర్‌ని కలిపిన మిశ్రమాన్నిముఖానికి పట్టించి ఆరిన తరువాత, నెమ్మదిగా పై పొరను తీసేయాలి. వారానికి రెండు, మూడుసార్లు ఇలా చేస్తే ముఖం పై ఉన్నసన్నటి వెంట్రుకలు మటుమాయమవుతాయి.కోడిగుడ్డులోని తెల్ల సొనలో ద్రాక్షరసం, నిమ్మరసం కలపాలి. ఈమిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20నిముషాలపాటు ఉంచి గోరువెచ్చనినీటితో కడిగేయాలి.కోడిగుడ్డు సొనలో, పాలపొడి, నిమ్మరసాన్ని కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

తేనెలో బాదం పప్పు పొడిని కలిపిఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసిఆరిన తరువాత కడిగేయాలి.పచ్చిపాలలో గంధం పొyì , తేనెసమపాళ్లలో కలిపి ముఖానికిపట్టించి ఆరిన తరువాత కడిగేయాలి.కమలాపళ్ల రసంలో పసుపుని రంగరించి ముఖానికి పట్టించి ఆరినతరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే నిగనిగలాడుతుంది.కొబ్బరి పాలు లేదా కొబ్బరి క్రీము,క్యారెట్‌ పేస్ట్‌ కలిపి ముఖానికి అప్లైచేస్తే చర్మం చాలా కాంతివంతంగాతయారవుతుంది. అలాగే చర్మసమస్యలు కూడా తగ్గుతాయి. 

మరిన్ని వార్తలు