కొలెస్ట్రాల్‌ తగ్గినా మధుమేహులకు సమస్యే!

8 Jun, 2019 05:57 IST|Sakshi

పరిపరిశోధన

టైప్‌ –2 మధుమేహులకు రక్తంలోని కొలెస్ట్రాల్‌ ఒక స్థాయికి మించి తగ్గితే నాడీ సంబంధిత సమస్యలు ఎక్కువవుతాయంటున్నారు జర్మనీకి చెందిన హైడల్‌బర్గ్‌ యూనివర్శిటీ హాస్పిటల్‌ శాస్త్రవేత్తలు. డయాబెటిక్‌ పాలీ న్యూరోపతి అని పిలిచే నాడీ సంబంధిత సమస్యలకు మధుమేహానికి మధ్య సంబంధం ఉందన్న విషయం చాలాకాలంగా తెలిసినప్పటికీ.. కొలెస్ట్రాల్‌ మోతాదులతో దీనికి లింక్‌ ఉండటంపై పెద్దగా సమాచారం లేదు. ఈ నేపథ్యంలో తాము వంద మంది మధుమేహులపై ప్రయోగం చేశామని.. వీరిలో న్యూరోపతి ఉన్నవారు, లేనివారు ఇద్దరూ ఉన్నారని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.

వీరి కుడికాలిని ఎమ్మారై స్కానింగ్‌ ద్వారా చూసినప్పుడు నాడీ సంబంధిత గడ్డలు కొన్ని సూక్ష్మస్థాయిలో కనిపించాయని.. రక్తంలోని కొలెస్ట్రాల్‌ మోతాదుకు, ఈ గడ్డల సైజుకు నేరుగా సంబంధం ఉన్నట్లు తాము వీరి ఇతర వైద్య పరీక్షల వివరాలను చూసినప్పుడు తెలిసిందని చెప్పారు. మధుమేహుల్లో కొలెస్ట్రాల్‌ తగ్గడానికి ఉపయోగించే మందులను విచక్షణతో వాడాలన్న భావనకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు