మధుమేహాన్ని అదుపులో ఉంచడం ఎలా?

3 May, 2018 01:46 IST|Sakshi

సెల్ఫ్‌ చెక్‌

డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడం, వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటే దానిని నివారించడం మన చేతుల్లోనే ఉంది. అది కూడా ఆహారపు అలవాట్లలో కొద్దిపాటి మార్పులతోనే. దీని గురించి మన అవగాహనను చెక్‌ చేసుకుందాం.

1.    ఒక గ్లాసు టొమాటో రసంలో కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే తాగుతుంటే మధుమేహం అదుపులోకి వస్తుంది.
    ఎ. అవును     బి. కాదు 

2.    రోజూ ఉదయం నాలుగైదు వేప ఆకులను నమిలితే మంచి ఫలితం ఉంటుంది.
    ఎ. అవును     బి. కాదు 

3.    డయాబెటిస్‌ అదుపులోకి రావాలంటే ఒక గ్లాసు పాలలో రెండు టీ స్పూన్ల మెంతిపొడిని కలిపి రోజూ ఉదయాన్నే తాగవచ్చు లేదా రెండు టీ స్పూన్ల మెంతులను అలాగే తీసుకోవచ్చు.
    ఎ. అవును     బి. కాదు 

4.    రాత్రి ఒక కప్పు నీటితో మెంతులను నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగినా ఫలితం ఉంటుంది. 
    ఎ. అవును     బి. కాదు 

5.    వంశపారంపర్యంగా డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఉన్న వాళ్లు మూడు నెలలపాటు ప్రతిరోజూ ఉదయాన్నే పది కరివేపాకు ఆకులను నమిలి తింటే మంచిది.
    ఎ. అవును     బి. కాదు 

6.    మనదేశంలో మిగిలిన నగరాలన్నింటికంటే హైదరాబాద్‌లోనే ‘టైప్‌ 2 డయాబెటిస్‌’ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. అందుకే దీనిని డయాబెటిస్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా అంటున్నారని మీకు తెలుసు.
    ఎ. అవును     బి. కాదు 

7.    వ్యాయామం, యోగసాధన వల్ల పాంక్రియాస్‌ గ్రంథి పనితీరు మెరుగుపడి డయాబెటిస్‌ అదుపులోకి వస్తుంది.
    ఎ. అవును     బి. కాదు 

మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి, నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన అవగాహన ఉందని అర్థం. ‘బి’లు ఎక్కువైతే మారిన మన జీవనశైలి ఆరోగ్యం మీద దుష్ప్రభావాన్ని చూపించకుండా ఉండాలంటే కొంత అవగాహన, మరికొంత ఆచరణ అవసరం అని గుర్తించాలి. 

మరిన్ని వార్తలు