బ్యూటిప్స్‌

10 Mar, 2019 00:39 IST|Sakshi

జిడ్డు పోవాలంటే..
వేసవిలో చర్మం త్వరగా జిడ్డు అవుతుంది. దీని కోసం పదే పదే ముఖం కడుగుతుంటారు. సబ్బుల వాడకం పెరిగితే చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది. అందుకని.. 

►స్పూన్‌ తేనె, పావు టీ స్పూన్‌ నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌ వేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. 

►రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, అర టీ స్పూన్‌ తేనె, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి రెండు–మూడు నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. 

►వేప ఆకుల ముద్ద, నారింజ తొనల ముద్ద సమానపాళ్లలో తీసుకోవాలి. దీంట్లో చందనం, ముల్తానీమిట్టి, తేనె, రోజ్‌వాటర్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి.  

మరిన్ని వార్తలు