చీర కొంగున చూపుల తోరణం

31 Mar, 2017 00:29 IST|Sakshi
చీర కొంగున చూపుల తోరణం

న్యూలుక్‌

పట్టుచీర కొంగు చివరలో సిల్కు దారాలను తీసి ముడులు వేయడం గురించి తెలిసిందే! ఆ ముడులకే కొన్ని అందమైన పూసలు గుచ్చితే ఒక అందం.
చీర రంగు కాంబినేషన్‌ సిల్క్‌ దారాలను, పూసలను ఉపయోగించి అల్లిన తర్వాత దానిని కొంగు చివరన జత చేయచేయవచ్చు.
జుంకాలు, గాజులు సిల్కుదారాలతో అందంగా రూపొందిస్తున్నారు. వీటి డిజైన్లనే పోలి ఉండేలా చీర కొంగున దారాల అల్లిక చేయాలి. గాజులు, హారాలు, జుంకాలు, చీర కొంగున... ఒకే విధమైన డిజైన్‌ ఉండటంతో వేడుకలో ఓ ప్రత్యేకతను సంతరించుకుంటుంది ∙ముందుగా చీర కొంగును కుట్టేసి ఆ తర్వాత విడిగా సిల్క్‌ దారాల కుచ్చులను కొంగుకు ముడి వేస్తే చాలు... ఇలా అందమైన తోరణం రూపుకడుతుంది.     
డిజైన్లను రూపొందించుకోవడానికి సమయం లేనివారు మార్కెట్లో ఉన్న రకరకాల మోడల్స్‌లో నచ్చినదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. వీటిని తెచ్చి, జత చేయడమే! ∙పట్టు చీరలతో పాటు ప్లెయిన్‌ సిల్క్‌ చీరలు, దుపట్టాల కొంగులను కూడా ఇలాగే అందంగా ముస్తాబు చేయవచ్చు.


ముత్యాలు, రతనాలు, జరీ జిలుగులతో తోరణం కడితే... చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. ఆ‘కళ్ల’ను చీరకొంగున కట్టేయాలంటే ఎన్నో సొబగులను కలిపి కుట్టాలి. అప్పుడే చీర అందం కొంగొత్త సింగారాలతో ముస్తాబవుతుంది.

మరిన్ని వార్తలు